ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు
ఈ వార్తాకథనం ఏంటి
పాలస్తీనా గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై విరుచుకపడ్డారు. రాకెట్ల వర్షం కురిపించారు.
కేవలం 30 నిమిషాల వ్యవధిలో 5000 రాకెట్లను ప్రయోగించారు. ఈ రాకెట్ల ప్రయోగం ద్వారా ఇజ్రాయెల్‌పై యుద్ధాన్ని ప్రకటించినట్లు హమాస్ ఉగ్రవాదుల సంస్థ తెలిపింది.
దీంతో ఇజ్రాయెల్‌ను యుద్ధ వాతావరణం అలుముకుంది. హమాస్ ఉగ్రవాదుల దాడిని ఇజ్రాయెల్ అధికారులు కూడా ధృవీకరించారు.
ఉగ్రవాదుల దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం కూడా గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు చేసింది.
ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డ హమాస్ ఉగ్రవాదులు
హమాస్ ఉగ్రవాదుల దాడుల దృష్ట్యా ఇజ్రాయెల్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు హమాస్ ఉగ్రవాద సంస్థ ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ హెచ్చరించింది.
హమాస్ ఉగ్రవాద సంస్థ గంట క్రితం దాడి చేసిందని ఆయన ట్వీట్ చేశారు.
వారు రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారని, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పౌరులకు రక్షణ కల్పిస్తుందని, హమాస్ ఉగ్రవాదులకు గుణపాఠం చెబుతుందన్నారు.
దాడి తర్వాత ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో సైరన్‌లు మోగించాయి. టెల్ అవీవ్‌లోని డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి భద్రతను ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇజ్రాయెల్‌పైకి దూసుకుపోతున్న రాకెట్లు
Rockets firing hasn’t stopped since the morning! #Gaza pic.twitter.com/cw7U9acgPp
— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) October 7, 2023