Trudeau- Katy Perry: కెనడా మాజీ ప్రధాని ట్రూడో-కేటీ పెర్రీ ప్రేమాయణం.. ఎట్టకేలకు కన్ఫామ్ చేసిన సింగర్!
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, అమెరికన్ గాయని కేటీ పెర్రీ మధ్య నడుస్తున్న ప్రేమాయణం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వరకు ప్రచార స్థాయిలో మాత్రమే ఉన్న ఈ సంబంధాన్ని తాజాగా పెర్రీ అధికారికంగా ధృవీకరించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రూడోతో కలిసి ఉన్న పలు ఫోటోలను పంచుకున్న ఆమె, వారి రిలేషన్‌ను పబ్లిక్ చేసింది. ఇటీవల ఇద్దరూ కలిసి జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను కూడా పెర్రీ షేర్ చేసింది. ఒక ఫోటోలో వీరిద్దరూ కలిసి సెల్ఫీకి పోజులిచ్చారు. మరో పోస్టులో ఒకే టేబుల్ వద్ద భోజనం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Details
గతంలోనూ కలిసిన సందర్భాలూ
'టోక్యో టైమ్స్ ఆన్ టూర్ అండ్ మోర్' అనే క్యాప్షన్ పెట్టి పెర్రీ ఈ పోస్టులను పబ్లిష్ చేసింది. జపాన్ మాజీ ప్రధాని ఫ్యూమియో కిషిడా, ఆయన భార్య యూకోలను ఇద్దరూ కలిసి కలిసిన అనంతరం పెర్రీ నుంచి ఈ పోస్ట్ వచ్చింది. ఆ సందర్భంగా కిషిడా తన ఎక్స్ (X) పోస్ట్‌లో పెర్రీని ట్రూడో భార్యగా పేర్కొనడం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. 'కెనడా మాజీ ప్రధాని, ఆయన భాగస్వామి మమ్మల్ని కలిశారు. ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో మేము కలుసుకున్నాము. జపాన్-కెనడా యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో కలిసి పనిచేసాము.
Details
సోషల్ మీడియాలో ఫోటోలు బయటికి
ఇప్పుడు మళ్లీ స్నేహాన్ని కొనసాగించటం ఆనందంగా ఉందని కిషిడా రాశారు. అక్టోబర్ 25న పారిస్‌లోని కేటీ పెర్రీ 41వ జన్మదిన వేడుకకు ట్రూడో హాజరైన ఫోటో కూడా బయటకు రావడంతో అప్పటి నుంచే వీరిద్దరి రిలేషన్‌పై ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా పెర్రీ తన సోషల్ మీడియా ద్వారా వారి ప్రేమాయణాన్ని అధికారికంగా వెల్లడించడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.