America : 100వ ఏటా కన్నుమూసిన US మాజీ సెక్రటరీ, నోబెల్ విజేత హెన్రీ కిస్సింజర్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, హెన్రీ కిస్సింజర్ కన్నుమూశారు. ఈ మేరకు తన 100వ ఏటా కనెక్టికట్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
దేశం ప్రచ్ఛన్న యుద్ధ చరిత్రను రూపొందించిన అధికారిగా, యునైటెడ్ స్టేట్స్ మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్ పేరు గాంచారు.
వివాదాస్పద నోబెల్ బహుమతి గ్రహీత, కిస్సింజర్ ఇద్దరు అమెరికా అధ్యక్షుల నేతృత్వంలో పని చేసిన కిస్సింజర్,యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానంపై ఆయన చెరగని ముద్ర వేశారు.
అయితే 100 ఏళ్లు నిండిన తర్వాత కూడా, కిస్సింజర్ వైట్‌హౌస్‌లోని సమావేశాలకు హాజరయ్యారు.ఈ క్రమంలోనే నాయకత్వ శైలికి సంబంధించిన పుస్తకాన్ని సైతం ప్రచురించారు.
ఉత్తర కొరియా పొంచి ఉన్న అణుముప్పుపై సెనేట్ కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
100వ ఏటా తుదిశ్వాస విడిచిన అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి
Henry Kissinger, American diplomat and Nobel winner, dead at 100 https://t.co/yzMLSXYPs9
— norm_pattis (@PattisNorm) November 30, 2023