
USA: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు అదృశ్యం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు అదృశ్యమయ్యారు. న్యూయార్క్‌కు చెందిన ఈ నలుగురు, వెస్ట్ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి కారులో ప్రయాణిస్తుండగా కనుమరుగయ్యారు. అదృశ్యమైన వారిని ఆశా దివాన్ (85), కిశోర్ దివాన్ (89), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)గా గుర్తించారు. వీరిలో చివరిసారిగా జూలై 29న పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్‌లో కనిపించారని పోలీసులు వెల్లడించారు. అక్కడే చివరిసారి వారి క్రెడిట్ కార్డును ఉపయోగించినట్లు విచారణలో తేలిందన్నారు.
Details
గాలింపు చర్యలు ప్రారంభం
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా నిర్ధారణ అయ్యింది. అధికారులు ఇప్పటికే వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అవసరమైతే హెలికాప్టర్లను సైతం గాలింపులో వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా (CHAI) స్పందించింది. ఈ నలుగురూ సురక్షితంగా ఉన్నారన్న వార్త కోసం తాము నిరీక్షిస్తున్నామని పేర్కొంది. అదృశ్యమైన వారితో సంబంధం ఉన్న ఫొటోలతో కూడిన సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది వారి ఆచూకీ తెలిసినవారు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని CHAI కోరింది.