LOADING...
France: ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రత.. ఫ్యాన్లు చాలక ఏసీలు, కూలర్లకు భారీ డిమాండ్
ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రత.. ఫ్యాన్లు చాలక ఏసీలు, కూలర్లకు భారీ డిమాండ్

France: ఫ్రాన్స్‌లో ఎండల తీవ్రత.. ఫ్యాన్లు చాలక ఏసీలు, కూలర్లకు భారీ డిమాండ్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 27, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌లో తీవ్ర వేసవి వేడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకోవడంతో కేవలం ఫ్యాన్లతో ఉపశమనం లభించడం లేదు. దీంతో ప్రజలు పెద్దఎత్తున ఏసీలు, కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

వివరాలు

తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..

పారిస్‌కు సమీపంలోని షంబరీ నగరంలో ఓ ఎలక్ట్రానిక్స్ దుకాణం తెరిచిన వెంటనే వినియోగదారులు భారీ సంఖ్యలో లోపలికి చేరుకున్నారు. ఆ దుకాణంలో ఏసీల కోసం పోటీపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని అనేక నగరాల్లో ఇదే తరహా పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఏడాది పొడవునా సగటున 12 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఫ్రాన్స్‌లో గత వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో..

Advertisement