Page Loader
భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51మందితో అత్యాచారం చేయించిన భర్త; వీడియోలు కూడా తీశాడట 
భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51మందితో అత్యాచారం చేయించిన భర్త; వీడియోలు కూడా తీశాడట

భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51మందితో అత్యాచారం చేయించిన భర్త; వీడియోలు కూడా తీశాడట 

వ్రాసిన వారు Stalin
Jun 22, 2023
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఏ భర్త చేయని ద్రోహం చేశాడు. తన భార్యకు డ్రగ్స్ ఇచ్చి, ఏకంగా 51మంది అపరిచితులతో అత్యాచారం చేయించాడు. దశాబ్దం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఫ్రాన్స్‌లో సంచలనంగా మారింది. 2011-2020మధ్యకాలంలో డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు ప్రతిరోజు రాత్రిపూట ఆహారంలో డ్రగ్స్ ఇచ్చేవాడు. ఇంటర్నెట్ ఫోరమ్‌లో అపరిచితులను సంప్రదించేవాడు. వారితో పరిచయం ఏర్పరుచుకునేవాడు. తన భార్య మత్తులోకి వెళ్లిన తర్వాత మజాన్‌లోని తన ఇంటికి అతిథులను పిలిచేవాడు. వారితో తన భార్యపై అత్యాచారం చేయించేవాడు. పైగా అత్యాచార దృశ్యాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించాడు. ఈ వీడియోలను యూఎస్‌బీ డ్రైవ్‌లో 'అబ్యుసెస్' అనే ఫోల్డర్‌లో సేవ్ చేశాడు.

ఫ్రాన్స్

92సార్లు అత్యాచారం,51మందిపై  కేసులు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోని 51మందిపై అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు వయస్సు 26 నుంచి 73 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు జైలు గార్డు, లారీ డ్రైవర్, జర్నలిస్ట్, ఐటీ ఉద్యోగి, మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు. పదేళ్లలో మొత్తం 92సార్లు బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అత్యచారం చేసిన వారు మరింత మంది ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. 2020లో మహిళలు దుస్తులు మార్చుకునే గదుల్లో డొమినిక్ రహస్య కెమెరాతో చిత్రీకరిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో తన భార్య విషయం వెలుగులోకి వచ్చింది.