
French mass rape Case: మహిళపై 72 మంది అత్యాచారం.. మాజీ భర్తే దోషి
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లో సంచలనం సృష్టించిన "ఫ్రెంచ్ మాస్ రేప్ కేసు"లో ఆమె మాజీ భర్త డొమినిక్ పెలికాట్ (72)ను కోర్టు దోషిగా తేల్చింది.
అతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ కేసు సంబంధించి న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. డొమినిక్, ప్రపంచం తలదించుకునేలా ఓ మహిళపై పాశవికంగా ప్రవర్తించినందుకు ఆయనను నేరస్థుడిగా పరిగణించింది.
శిక్షను తీసుకున్న అతడు దాదాపు మరణం వరకు జైల్లోనే గడిపే అవకాశాలు ఉన్నాయి.
వివరాలు
అసలు ఏంటా కేసు?
కేసు ప్రకారం, డొమినిక్ పెలికాట్ ఫ్రాన్సులోని ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు తన భార్యపై అనేక సంవత్సరాలపాటు దారుణంగా ప్రవర్తించాడు.
ఆమె ఆహారంలో మత్తుమందు కలిపి, ఆమె మత్తులోకి వెళ్లిన తరువాత తన స్నేహితులను ఇంటికి రప్పించి, ఆమెపై లైంగిక దాడులు చేయించేవాడు.
వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే, రహస్య కెమెరాలతో చిత్రీకరించేవాడు. ఈ చర్యలు దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగాయి.
2011 నుండి 2020 వరకు ఈ అకృత్యాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2020లో ఓ షాపింగ్ మాల్‌లో డొమినిక్ మరొక ఘటనలో మహిళలపై రహస్యంగా వీడియోలు తీస్తుండగా, అక్కడి సెక్యూరిటీ గార్డు అతడిని పట్టుకున్నాడు.
వివరాలు
72 మందితో 92 సార్లు ఆమెపై అత్యాచారం
ఆ తర్వాత, పోలీసులు అతడి ఫోన్, కంప్యూటర్‌ను తనిఖీ చేయగా, అతడి భార్యపై జరిగిన అనేక అత్యాచారాలు, దాడుల ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి.
ఈ ఫొటోలు, వీడియోలు కేసుకు కీలకమైన ఆధారాలుగా మారాయి.
పోలీసులు విచారణ చేయగా, మొత్తం 72 మందితో 92 సార్లు ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది.
ఈ దురాక్రమణలకు పాల్పడిన వారిలో వయస్సు 26 నుండి 73 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వీరిలో 51 మందిని గుర్తించగా, మిగిలిన వారి వివరాలు లభించలేదు.
విచారణ సమయంలో, డొమినిక్ కోర్టులో తనపై మోపిన ఆరోపణలను అంగీకరించాడు.
వివరాలు
వీడియో ఆధారాలను పరిశీలించి, డొమినిక్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం
అతను తన వయస్సులోని మిగతా 50 మందిని ప్రస్తావిస్తూ, తాను కూడా ఒక రేపిస్ట్ అని ఒప్పుకున్నాడు.
చివరగా, న్యాయస్థానం వీడియో ఆధారాలను పరిశీలించి, డొమినిక్‌ను దోషిగా తేల్చింది.
ఇటీవల, బాధితురాలు డొమినిక్‌తో విడిపోయింది. ఆమె ఆ తర్వాత ఈ దురాచారంపై బహిరంగ విచారణ చేపట్టాలని కోర్టును ఆశ్రయించింది.