LOADING...
Death Penalty: భుట్టో నుంచి సద్దాం వరకు.. మరణశిక్ష పడిన దేశాధినేతలు వీరే..!
భుట్టో నుంచి సద్దాం వరకు.. మరణశిక్ష పడిన దేశాధినేతలు వీరే..!

Death Penalty: భుట్టో నుంచి సద్దాం వరకు.. మరణశిక్ష పడిన దేశాధినేతలు వీరే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

1975 ఆగస్టు 15. భారత్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తేలియాడుతుండగా, కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్‌లో మాత్రం భారీ రాజకీయ ప్రకంపనలు సంభవించాయి. బంగ్లాదేశ్ జాతిపిత, అప్పటి దేశాధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దారుణ హత్యకు గురయ్యారు. ఆ భయానక హత్యాకాండలో ఆయన కుమార్తె షేక్ హసీనా మాత్రం ప్రాణాలతో బయటపడి, దాదాపు ఐదున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కొనసాగించారు. తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై మరణదండన విధించిన నేపథ్యంలో గతంలో మరణశిక్ష అనుభవించిన ప్రపంచ దేశాధినేతల జాబితా మరోసారి చర్చకు వచ్చింది.

Details

 జుల్ఫికర్ అలీ భుట్టో 

పాక్ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రధాన శక్తిగా ఉన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) స్థాపకుడు, మాజీ ప్రధానమంత్రి, మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోకు 1979 ఏప్రిల్ 4న ఉరిశిక్ష అమలు చేశారు. అప్పటికి ఆయన వయసు 51 ఏళ్లు. పీపీపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అహ్మద్ రెజా కసూరీ హత్యకు భుట్టో ఆదేశాలివ్వడమేనన్న ఆరోపణలపై కోర్టు ఆయనను మరణశిక్షకు తీర్పునిచ్చింది. రావల్పిండి జిల్లా జైలులో ఉదయం 2 గంటలకు ఉరిశిక్ష అమలు చేశారు.

Details

అద్నాన్ మెండెరస్ 

తుర్కియేలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రతీకగా నిలిచిన అద్నాన్ మెండెరస్ ప్రభుత్వం, సైన్యంలో ఉన్న ఉన్నతాధికారుల తిరుగుబాటుతో కూలిపోయింది. రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ దశాబ్దాలపాటు దేశాన్ని కఠినంగా పాలించిన తర్వాత, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మెండెరస్ ప్రభుత్వం ఆశలను రేకెత్తించింది. అయితే మర్మరా సముద్రంలోని ఓ దీవిలో జరిగిన విచారణలో ఆయనతోపాటు మరొక ముగ్గురికి కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం ఆ తీర్పును అమలు చేశారు.

Details

 చున్ డూ హ్వాన్ (దక్షిణ కొరియా) 

1979లో జరిగిన సైనిక తిరుగుబాటుతో దక్షిణ కొరియా అధికారాన్ని చున్ డూ హ్వాన్ స్వాధీనం చేసుకున్నారు. ఏడాది తర్వాత జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ఆయన తీవ్రంగా అణచివేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆక్షేపణలకు దారితీసింది. తరువాత ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించినా, సుప్రీంకోర్టు ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.

Details

సద్దాం హుసేన్ 

భారతదేశానికి అనుకూలుడిగా పేరున్న ఇరాక్ నియంత సద్దాం హుసేన్‌ను 2006 డిసెంబర్ 30న ఉరిశిక్ష అమలు చేశారు. 1982లో ఆయనపై జరిగిన హత్యాయత్నానికి ప్రతీకారంగా 148 మంది షియా ముస్లింలను హతమార్చారన్న అభియోగాలపై ఆయనకు మరణదండన ఖరారైంది. ఉత్తర బాగ్దాద్‌లోని కఢీమియా జిల్లాలో ఉన్న సైనిక నిఘా విభాగం కార్యాలయంలో ఆయనను ఉరిశిక్ష అమలు చేశారు. పర్వేజ్ ముషారఫ్ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్‌కు దేశద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. ఎమర్జెన్సీ అమలు చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్న అభియోగాలపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే 2020 జనవరిలో అతనిపై విధించిన మరణశిక్షను కోర్టు రద్దు చేసింది.