
USA: అసభ్యకరమైన సందేశాలకు వేదికగా ప్రభుత్వ చాట్ టూల్.. ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో 100 మందికి పైగా ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు వేసేందుకు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) సిద్ధమయ్యారు.
ఈ ఏజెన్సీకి సంబంధించిన చాట్ టూల్‌ను అసభ్యకరమైన సందేశాలకు వేదికగా మార్చుకున్నారనే ఆరోపణల కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఈ చాట్ టూల్‌ను అత్యంత గోప్యమైన అంశాలను చర్చించేందుకు వినియోగిస్తారు.
అయితే,కొందరు అధికారులు దీన్ని అసభ్యకరమైన సందేశాల కోసం ఉపయోగించారనే విషయం ఇటీవల ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో,సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు మంగళవారం ఫ్యాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసీ గబ్బార్డ్ తెలిపారు.
వివరాలు
100మందికి పైగా అధికారులపై చర్యలు
"ఇందులో పాల్గొన్న15ఏజెన్సీలకు చెందిన 100మందికి పైగా అధికారులపై చర్యలు చేపట్టాం. వారిపై భద్రతా క్లియరెన్స్ తొలగించేందుకు ఆదేశాలు జారీ చేశాం.ఇది ఏజెన్సీ నైతికతను,వృత్తిపరమైన నియమాలను తీవ్రంగా ఉల్లంఘించడం"అని ఆమె స్పష్టం చేశారు.
ఈ అసభ్యకరమైన సంభాషణల్లో పాల్గొన్న అధికారులను శుక్రవారానికి గుర్తించాలని తులసీ గబ్బార్డ్ జారీ చేసిన మెమోను ఏజెన్సీ కార్యాలయ ప్రతినిధి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇక,ప్రభుత్వ చాట్ టూల్‌ను కొందరు అసభ్యకరమైన విధంగా ఉపయోగించడం అసహ్యకరమని ఎన్ఎస్‌ఏ ప్రకటించింది.వారిని బాధ్యతల నుంచి తొలగించే చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్ఎస్‌ఏ, డీఎన్‌ఐలు ఎక్స్ ద్వారా వెల్లడించాయి.
ఇదిలా ఉండగా,ఈవివాదాన్ని తొలుత హక్కుల కార్యకర్త క్రిస్టోఫర్ రూఫో బయటపెట్టారు.
ట్రాన్స్ జెండర్‌లకు సంబంధించిన సందేశాలు ప్రభుత్వ చాట్ టూల్‌లో ఇంటర్‌లింక్‌గా కనిపించినట్లు రూఫో తెలిపారు.