
China: చైనాలో యువకుడి ప్రాణం తీసిన గేమింగ్.. ఐదు రోజులు నిద్ర లేకుండా ఆడి!
ఈ వార్తాకథనం ఏంటి
కొందరు ఉద్యోగులు కంపెనీలో అదనపు గంటలు పని చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఒత్తిడి పెరుగుతున్న లెక్క చేయకుండా శ్రమిస్తారు.
ఫలితంగా ఈ ప్రభావం వారి ఆరోగ్యంపై చూపుతుందని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి.
ఇటీవల ఓ విద్యార్థి తన కోర్సులో భాగంగా ఐదు రాత్రులు నిద్రపోకుండా పనిచేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనా(China) లోని హెనాన్స్ పింగ్డింగ్షాన్ వెకేషనల్ అండ్ టెక్నికల్ కాలేజీలో లీ హావో అనే విద్యార్థి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
ఇంటర్న్ షిప్‌లో భాగంగా లైవ్ స్ట్రీమింగ్ గేమింగ్ సెషన్‌లో చేరాడు.
Details
అస్వస్థతకు గురై మరణించిన విద్యార్థి
స్ట్రీమింగ్‌లో భాగంగా 26 రోజుల్లో 240 గంటల పాటు ఆ విద్యార్థి లైవ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
అందుకోసం కంపెనీ ఆ విద్యార్థికి 58వేలకు పైగా జీతాన్ని అందిస్తుంది. ఈ క్రమంలో అతడు రాత్రి షిప్ట్ కేటాయించారు.
ఐదు రాత్రులు నిద్ర లేకపోవడంతో అస్వస్థతకు గురైన ఆ విద్యార్థిని అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
ఆ విద్యార్థి మరణానికి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని ఆ సంస్థ తేల్చి చెప్పింది. దీంతో యువకుడి రావాల్సిన వేతనాన్ని అతడి తండ్రికి అందజేశారు.