Israel-Hamas war: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ విరామం.. అమెరికా ప్రకటన.. ఖండించిన ఇజ్రాయెల్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరగాజాలోని కొన్ని ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను రోజుకు నాలుగుగంటలపాటు నిలిపివేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని వైట్‌హౌస్ గురువారం తెలిపింది.
రెండు మానవతా కారిడార్‌ల వెంబడి ప్రజలు తరలివెళ్లేందుకు ఉద్దేశించిన యుద్ధం విరామాన్ని ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటిస్తుందని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.
అమెరికా చేసిన ఈ ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది.ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు గాజా నగరాన్ని చుట్టుముట్టాయి.
హమాస్ మిలిటెంట్లను వేటాడేందుకు దాని ట్యాంకులు నగరం నడిబొడ్డున ముందుకు సాగుతున్నాయి.
హమాస్ తో అక్కడ తీవ్ర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రి వద్దకు వేలాది మంది శరణార్థులు చేరుకున్నారు.
హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఈ ఆసుపత్రి కింద ఉందని..దానిని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గాజాలో రోజువారీ నాలుగు గంటల విరామాలకు అంగీకరించిన ఇజ్రాయెల్..అమెరికా ప్రకటన
Israel agrees to four-hour daily pauses in Gaza, US sayshttps://t.co/K2vTju69lL
— Punch Newspapers (@MobilePunch) November 9, 2023