LOADING...
PM Modi: గాజా శాంతి ఒప్పంద సమ్మిట్.. మోదీని హాజరు కావాలని ట్రంప్ ఆహ్వానం?
గాజా శాంతి ఒప్పంద సమ్మిట్.. మోదీని హాజరు కావాలని ట్రంప్ ఆహ్వానం?

PM Modi: గాజా శాంతి ఒప్పంద సమ్మిట్.. మోదీని హాజరు కావాలని ట్రంప్ ఆహ్వానం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్ ప్రాంతంలో సోమవారం జరగనున్న గాజా శాంతి ఒప్పంద సమ్మిట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపారు. ఈ ప్రత్యేక సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోదీని హాజరుకావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అదేవిధంగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసీ సైతం ప్రధాని మోదీకి స్వయంగా ఆహ్వానం పంపినట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఈ ఆహ్వానం చివరి నిమిషంలో ప్రధాని మోదీకి అందినట్లు కూడా వెల్లడైనది. అయితే, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైనా అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడలేదు.