LOADING...
Sick Leave: సిక్ లీవ్‌కు ఇక వైద్య ధ్రువీకరణ తప్పనిసరి!
సిక్ లీవ్‌కు ఇక వైద్య ధ్రువీకరణ తప్పనిసరి!

Sick Leave: సిక్ లీవ్‌కు ఇక వైద్య ధ్రువీకరణ తప్పనిసరి!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 03, 2026
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన జర్మనీ ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయడానికి సమగ్ర సంస్కరణల ప్రణాళికను ప్రకటించింది. ఈ సంస్కరణల్లో భాగంగా ప్రతిపాదించిన ఒక కీలక నిబంధన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే సిక్ లీవ్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలనే నిర్ణయం.

వివరాలు

జర్మనీలో కొత్త సిక్ లీవ్ నిబంధనలు..

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉత్పాదకతను పెంచడం, దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లను అధిగమించడం లక్ష్యంగా జర్మనీ ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఉద్యోగుల సిక్ లీవ్ విధానంలో కూడా కీలక మార్పులు ప్రతిపాదించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగి అనారోగ్య కారణంగా సెలవు తీసుకుంటే, ఆ సెలవు ప్రారంభమైన తొలి రోజే సంబంధిత వైద్యుడి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు

ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలగకుండా సరికొత్త నిర్ణయాలు..

ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం, ఉద్యోగులు మొదటి మూడు రోజుల వరకు ఎలాంటి వైద్య ధ్రువీకరణ పత్రం లేకుండానే సిక్ లీవ్‌ను వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే తాజా ప్రతిపాదనతో ఆ వెసులుబాటుకు ముగింపు పలకనున్నారు. ప్రభుత్వం ఈ మార్పులను ఉత్పాదకతను మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా మారుతున్న దీర్ఘకాలిక సమస్యలను అధిగమించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును అందించడం వంటి ప్రధాన లక్ష్యాలతో తీసుకువస్తోంది.

Advertisement