LOADING...
Go back to India: ఐర్లాండ్‌లో జాత్యాహంకార దాడి కలకలం.. భారత సంతతి బాలికపై అమానుష దాడి
ఐర్లాండ్‌లో జాత్యాహంకార దాడి కలకలం.. భారత సంతతి బాలికపై అమానుష దాడి

Go back to India: ఐర్లాండ్‌లో జాత్యాహంకార దాడి కలకలం.. భారత సంతతి బాలికపై అమానుష దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
02:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్‌లో జాతి వివక్షతో కూడిన ఘోర ఘటన ఒక్కసారిగా సంచలనం రేపుతోంది. వాటర్‌ఫోర్డ్ ప్రాంతంలో ఆరేళ్ల భారతీయ మూలాలున్న చిన్నారి తన ఇంటి ఎదుట ఆడుకుంటూ ఉండగా,అక్కడికి సైకిళ్లపై వచ్చిన కొంతమంది బాలురు దారుణంగా దాడికి పాల్పడ్డారు. తిడుతూ,"ఐర్లాండ్ వదిలి వెళ్ళు,ఇండియాకి పో"అంటూ అరిచారు.అంతటితో ఆగకుండా సైకిళ్లను ఆమె శరీరంపైకి దించడమే కాకుండా, ప్రత్యేకంగా సున్నితమైన భాగాలపై బలంగా ఢీకొట్టారు. ఐర్లాండ్‌లో చిన్నారిపై ఇలా జాత్యాహంకార దాడి నమోదవడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు దేశంలోని వేరేవేరు ప్రాంతాల్లో భారతీయులపై వివిధ రకాల దాడులు జరిగినప్పటికీ,ఓ చిన్నారిపై ఇంత క్రూరంగా జరిగిన ఘటన ఇప్పటిదాకా నమోదు కాలేదు. సోమవారం సాయంత్రం,తన స్నేహితులతో కలిసి ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాలు 

జుట్టును బలంగా లాగారని, వెనుక నుండి సైకిల్‌తో కొట్టారని..

దాడిలో పాల్గొన్నవారిలో ఒక బాలికతో పాటు కొంతమంది అబ్బాయిలు ఉన్నారని బాధిత చిన్నారి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో తల్లి ఇంట్లో తన పదినెలల కొడుకుకు ఆహారం పెడుతూ ఉండగా,బయట ఉన్న తన కూతురిపై దాడి జరిగిందని, ఆమె కేకలు,ఏడుపుతో విషయం తెలిసిందని వివరించారు. ఆమె ముఖంపై కూడా కొట్టారని బాధతో విలవిలలాడుతూ ఇంటికి వచ్చిందని చెప్పారు. తన జుట్టును బలంగా లాగారని, వెనుక నుండి సైకిల్‌తో కొట్టారని చిన్నారి చెప్పినట్టు తల్లి తెలిపింది. ఈ దాడి తర్వాత రెండు రోజులుగా ఆ పాప తీవ్ర భయాందోళనలో ఉంది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదు. ఇంట్లో నుంచి బయటకి వెళ్లడానికే భయపడుతోందని బాధతో తల్లి వాపోయారు.