LOADING...
EU trade deal : ఈయూతో ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15% సుంకాలు 
ఈయూతో ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15% సుంకాలు

EU trade deal : ఈయూతో ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15% సుంకాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్‌తో కొత్తగా ఒక భారీ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ ఇకపై ఈయూ దేశాల నుండి వచ్చే దిగుమతులపై 15 శాతం సుంకాలను విధించనున్నది. అమెరికా ఈ ఒప్పందాన్ని చారిత్రకమైనదిగా పేర్కొంటూ,ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా అభివర్ణించింది. ఆగస్టు 1వ తేదీతో ముగియనున్న గడువును దృష్టిలో ఉంచుకుని, యూరోపియన్ వస్తువులపై 30 శాతం మేరకు సుంకాలు విధించే ప్రమాదాన్ని నివారించడానికి ఈ ఒప్పందం కుదిరింది. స్కాట్లాండ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్,యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లు ఈ ఒప్పందంపై ఓకే చెప్పారు.

వివరాలు 

750 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన వనరులను దిగుమతి

ఈ ఒప్పందం ఇరు పక్షాలకు లాభకరంగా ఉంటుందని, ఇదే ఈయూతో కుదిరిన అతిపెద్ద ఒప్పందంగా భావిస్తున్నట్లు ట్రంప్ వార్తా సంస్థ ఎఎఫ్‌పీకి పేర్కొన్నారు. ఇప్పుడే అమలులోకి రానున్న 15 శాతం సుంకాలు యూరోప్‌ దేశాల ఆటోమొబైల్ పరిశ్రమ, ఔషధ తయారీ, సెమీకండక్టర్‌ల వంటి కీలక రంగాలపై వర్తించనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో, ఈ ఒప్పందం ప్రకారం యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు అమెరికా నుండి సుమారు 750 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన వనరులను దిగుమతి చేసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ఈయూ నుంచి 600 బిలియన్ డాలర్ల మేర అదనపు పెట్టుబడులు కూడా అందనున్నాయని చెప్పారు.

వివరాలు 

సుంకాలను తొలగించేందుకు ఇరు దేశాలు పరస్పర అంగీకారం 

రష్యా నుండి ఇంధనంపై ఆధారాన్ని తగ్గించే లక్ష్యంతో, తదుపరి మూడు సంవత్సరాల్లో యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ద్రవీకృత సహజవాయువు (LNG),క్రూడ్ ఆయిల్, అణుఇంధనం వంటి వనరులను భారీగా కొనుగోలు చేయనున్నట్లు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వివరించారు. విమానాల తయారీ, కొన్ని రకాల రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యమైన ముడి పదార్థాలపై విధిస్తున్న సుంకాలను తొలగించేందుకు ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన 2025 జనవరి నుండి ఈయూ పలు సుంకాల భారాన్ని భరించాల్సి వచ్చింది.

వివరాలు 

కార్లపై 25 శాతం

కార్లపై 25 శాతం, ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం వరకు సుంకాలను చెల్లించాల్సి వచ్చింది. అయితే తాజా ఒప్పందం కుదరని పరిస్థితిలో, ప్రస్తుతం ఉన్న 10 శాతం సుంకాలను 30 శాతం వరకు పెంచే అవకాశముందని అమెరికా వైపు నుండి స్పష్టమైన హెచ్చరిక కూడా వెలువడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈయూతో ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పందం.