Page Loader
Hangover Leave: ఉద్యోగులకు శుభవార్త.. ఉచిత ఆల్కహాల్‌, హ్యాంగోవర్‌ లీవ్‌ అందిస్తున్న జపాన్‌ సంస్థ
ఉద్యోగులకు శుభవార్త.. ఉచిత ఆల్కహాల్‌, హ్యాంగోవర్‌ లీవ్‌ అందిస్తున్న జపాన్‌ సంస్థ

Hangover Leave: ఉద్యోగులకు శుభవార్త.. ఉచిత ఆల్కహాల్‌, హ్యాంగోవర్‌ లీవ్‌ అందిస్తున్న జపాన్‌ సంస్థ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్‌ సంస్థలు యువతను ఆకర్షించేందుకు కొత్త కొత్త విధానాలను అవలంబిస్తుంటాయి. అధిక వేతనం అందించడం, ప్రాక్టికల్‌ లీవ్స్‌ కల్పించడం, విశ్రాంతికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం వంటి మార్గాలను అనుసరిస్తుంటాయి. అయితే జపాన్‌కు చెందిన ట్రస్ట్‌ రింగ్‌ అనే సంస్థ మాత్రం భిన్నంగా ఆలోచించి వినూత్నమైన ప్రయోగాన్ని మొదలుపెట్టింది. ఉద్యోగులకు ఉచిత ఆల్కహాల్‌, హ్యాంగోవర్‌ లీవ్‌ ట్రస్ట్‌ రింగ్‌ సంస్థ తన ఉద్యోగులకు ఉచితంగా ఆల్కహాల్‌ అందిస్తోంది. అంతేకాకుండా, మద్యం ఎక్కువగా సేవించిన ఉద్యోగులు మత్తు దిగాక తిరిగి విధుల్లో చేరేందుకు హ్యాంగోవర్‌ లీవ్‌ అందిస్తోంది. ఈ లీవ్‌ను ఉపయోగించి ఉద్యోగులు తగిన విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ తమ పనిని సమర్థంగా నిర్వహించవచ్చని కంపెనీ ప్రకటించింది.

Details

 ఉద్యోగుల స్పందన 

కంపెనీ అందిస్తున్న హ్యాంగోవర్‌ లీవ్‌ చాలా ఉపయోగకరంగా ఉందని ఉద్యోగులు అంటున్నారు. అవసరమైనప్పుడు ఈ ప్రత్యేక లీవ్‌ తీసుకుని, రెండు లేదా మూడు గంటలు నిద్రపోయి తిరిగి ఆఫీస్‌కు హాజరవుతున్నామన్నారు. దీంతో పని ప్రభావితం కాకుండా మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. కంపెనీ ఉద్దేశ్యం ట్రస్ట్‌ రింగ్‌ యాజమాన్యం ప్రకారం, ఉద్యోగులకు ఆరంభంలోనే ఎక్కువ వేతనం అందించలేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ ప్రయోజనాలను అందిస్తున్నట్లు వెల్లడించింది. తక్కువ వేతనం ఉన్నా ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకొని హాయిగా పనిచేయగలిగే విధంగా ఈ విధానం రూపొందించినట్లు వివరించింది. ఈ వినూత్న విధానం వల్ల ఉద్యోగుల పనితీరు మెరుగుపడటమే కాకుండా, సంస్థలోని వాతావరణం మరింత అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.