తదుపరి వార్తా కథనం

US Govt Shutdown: ద్వైపాక్షిక నిధుల బిల్లుకు ట్రంప్ అభ్యంతరం.. అమెరికాకి మళ్లీ షట్‌డౌన్ గండం
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 19, 2024
09:05 am
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికా అధికార మార్పిడికి సిద్ధమవుతున్న వేళ, మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన ఎదురైంది.
క్రిస్మస్ సమీపిస్తున్న సమయంలో షట్‌డౌన్ ముప్పును నివారించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళికకు, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
దీనిపై చర్చ జరగాల్సిందిగా స్పీకర్ మైక్ జాన్సన్ రిపబ్లికన్ చట్టసభ్యులకు సూచించారు.
ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు తగ్గిపోతున్న ఈ సమయంలో, ట్రంప్ నిర్ణయం వల్ల కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
ఎలాన్ మస్క్ ప్రభావం
ఇక, ఈ పరిణామం వెనుక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రభావం ఉన్నట్లు సమాచారం.
బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిధుల ప్రణాళికలో ఖర్చులు అధికంగా ఉన్నాయంటూ మస్క్ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేశారు
ఈ ప్రణాళికకు అనుమతి ఇవ్వకూడదని రాసుకొచ్చారు.
మీరు పూర్తి చేశారు