LOADING...
Israel-Hamas: హమాస్ నుండి మరో ఆరుగురు బందీల విడుదలకు గ్రీన్ సిగ్నల్!
హమాస్ నుండి మరో ఆరుగురు బందీల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Israel-Hamas: హమాస్ నుండి మరో ఆరుగురు బందీల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాజాలో శాంతిస్థాపన కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీని ద్వారా 15 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణకు బ్రేక్ పడింది. ఈ ఒప్పందం ప్రకారం, ఇరువర్గాలు బందీలను, ఖైదీలను విడిచిపెట్టే ప్రక్రియ ప్రారంభించాయి. హమాస్ తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా మరో ఆరుగురిని విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే, వారి విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇంకా వెల్లడించలేదు.

Details

మృతదేహంపై వివాదం

ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరో కొత్త వివాదం రాజుకుంది. ఇటీవల హమాస్ పంపిన ఒక మృతదేహం తమ దేశ పౌరురాలిది కాదని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఆ మృతదేహం తమ కుమార్తెదేనని మృతురాలి కుటుంబ సభ్యులు ధృవీకరించడం గమనార్హం. షిరి బిబాస్, ఆమె ఇద్దరు చిన్నారులు హమాస్ చెరలో బందీగా ఉన్నారు. యుద్ధం కారణంగా షిరి బిబాస్, చిన్నారులు మరణించారు. ఇటీవల హమాస్ ఆమె మృతదేహాన్ని ఇజ్రాయెల్‌కు పంపించింది. అయితే, అది తమ దేశ పౌరురాలిది కాదని, పాలస్తీనాకు చెందిన మహిళదని ఫోరెన్సిక్ అధికారులు నిర్ధారించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ తప్పిదంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందిస్తూ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

Details

హమాస్ వివరణ 

దీనిపై హమాస్ స్పందిస్తూ ఇజ్రాయెల్ రక్షణ దళాల దాడుల వల్ల బందీలు ఉన్న ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురయ్యాయని, అందుకే ఈ పొరపాటు జరిగి ఉండొచ్చని తెలిపింది. అయినా ఈ అంశంపై మరోసారి సమీక్ష చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ ఘటనల నేపథ్యంలో షిరి బిబాస్ కుటుంబం స్పందిస్తూ, హమాస్ పంపిన మృతదేహం ఆమెదేనని ధృవీకరించారు. ఈ వివాదం ఇజ్రాయెల్-హమాస్ మధ్య భిన్న అభిప్రాయాలను మరింత పెంచింది.