Antarctica: అంటార్కిటికాలో పెరుగుతున్న పచ్చదనం.. ఆందోళన చెందుతున్న శాస్త్రవేత్తలు
పచ్చదనం పెరగడం మంచిదని అందరం అనుకుంటాం. ప్రస్తుతం ప్రపంచం అంతా అదే కోరుకుంటుంది. పర్యావరణ మార్పులకు సమర్థంగా ఎదుర్కోవటానికి పచ్చదనం అవసరమని భావిస్తాం. అయితే అంటార్కిటికాలో పచ్చదనం పెరుగుతుండటం మాత్రం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ పచ్చదనం పెరగడం, గ్లోబల్ వార్మింగ్‌కి సంకేతమని పరిశోధన చెబుతోంది. భూమిపై అత్యంత చల్లని ప్రాంతంగా అంటార్కిటికా కు గుర్తింపు ఉంది. హిమనదాలు, మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతంలో, సాధారణంగా మొక్కలు పెరగటం చాలా కష్టం. కొన్ని ప్రత్యేకమైన, పచ్చని నాచు మొక్కలు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. అవి కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి.
సముద్ర మట్టాలు పెరిగే ఛాన్స్
ఈ పచ్చదనం విపరీతంగా పెరుతోందని "నేచర్ జియోసైన్స్" వెల్లడైంది. సాధారణంగా అంటార్కిటికా సూర్యకిరణాలను ప్రతిబింబిస్తుంది, ఇది భూమిని చల్లగా ఉంచుతుంది. అయితే, పచ్చదనం పెరిగితే ఈ ప్రతిబింబం తగ్గిపోయే అవకాశం ఉంది. తద్వారా తాపం పెరుగుతుంది. 1986లో కేవలం 1 చదరపు కిలోమీటర్‌లో ఉన్న పచ్చదనం, 2021 నాటికి 12 చదరపు కిలోమీటర్లకు పెరిగింది, అంటే 10 రెట్లు! 2016 నుంచి 2021 మధ్యే 30% పెరుగుదల కనిపించింది. పచ్చదనం పెరగడం అంటే అంటార్కిటికా మంచు కరుగుతుందని అర్థం. అక్కడ పెరగని మొక్కలు, కొత్త జీవజాలం కూడా ఉత్పత్తి అవుతోంది. ఉష్ణోగ్రతలు వేడెక్కుతుండటంతో హిమానీనదాలు కరుగుతాయి, సముద్రమట్టాలు పెరుగుతాయి. ఈ పరిణామాలే శాస్త్రవేత్తల ఆందోళనకు కారణం.