
Donald Trump : ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) దుండగులు కాల్పులకు తెగబడ్డాడు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్ ఆయన కుడి చెవికి తాకింది.
గాయపడిన ట్రంప్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు.
వివరాలు
ట్రంప్ కి ఎలాన్ మస్క్ భారీ విరాళం
కాగా, ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మెటా ఆయనపై విధించిన ఆంక్షలను తొలగించిన తరుణంలో కాల్పుల ఘటన జరగడం రిపబ్లికన్ లను ఆందోళనకు గురి చేసింది.
కాగా నిన్నే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ విరాళం అందించారు.
ఆయన ట్రంప్‌నకు నేరుగా విరాళం ఇవ్వనప్పటికీ ఆయన తరపున ప్రచారం చేస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ)కి దానిని అందజేశారు.