NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Hajj Yatra 2025: జూన్ 4 నుండి హజ్ యాత్ర ప్రారంభం.. సౌదీ అరేబియా అధికారిక ప్రకటన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Hajj Yatra 2025: జూన్ 4 నుండి హజ్ యాత్ర ప్రారంభం.. సౌదీ అరేబియా అధికారిక ప్రకటన
    జూన్ 4 నుండి హజ్ యాత్ర ప్రారంభం.. సౌదీ అరేబియా అధికారిక ప్రకటన

    Hajj Yatra 2025: జూన్ 4 నుండి హజ్ యాత్ర ప్రారంభం.. సౌదీ అరేబియా అధికారిక ప్రకటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా భావించబడుతుంది.

    ఇది సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఉన్న మస్జిద్ అల్-హరామ్ అనే పవిత్ర మసీదు పరిధిలో జరగుతుంది

    ఇస్లాం మతంలో హజ్ యాత్రను అత్యంత ముఖ్యమైన మతపరమైన బాధ్యతగా పరిగణిస్తారు.

    ఒక ముస్లిం వ్యక్తి శారీరకంగా, ఆర్థికంగా స్తోమత ఉన్నంతవరకు తన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ హజ్ యాత్ర చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంటాడు.

    ఇస్లామిక్ క్యాలెండర్‌లో 12వ నెలగా భావించబడే ధుల్ హిజ్జా నెలలో హజ్ యాత్ర జరుగుతుంది.

    ఈ యాత్ర ధుల్ హిజ్జా 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో లక్షలాది ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటారు.

    వివరాలు 

    చంద్రుని తొలి దర్శనంపై ఆధారపడి హజ్ యాత్ర

    హజ్ యాత్రలో భాగంగా ముస్లింలు కాబా చుట్టూ తవాఫ్ చేయడం (ప్రదక్షిణలు చేయడం), సఫా-మర్వా కొండల మధ్య నడక చేయడం, మినా, అరాఫాత్, ముజ్దలిఫా ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

    2025 సంవత్సరానికి గాను,ఈ ఏడాది హజ్ యాత్ర జూన్ 4వతేదీ నుంచి జూన్ 9వతేదీ మధ్య నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేయబడింది.

    అయితే, ఖచ్చితమైన తేదీ చంద్రుని తొలి దర్శనంపై ఆధారపడి నిర్ణయిస్తారు.

    ఇస్లామిక్ క్యాలెండర్ పూర్తిగా చంద్రుని చక్రాన్ని అనుసరిస్తుంది. అందువల్ల ఈ క్యాలెండర్ సాధారణ గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే సంవత్సరానికి సగటున 11 లేదా 12 రోజులు ముందుగా జరుగుతుంది.

    ఈ కారణంగా ప్రతి సంవత్సరం హజ్ తేదీలు మారుతూ ఉంటాయి.

    వివరాలు 

    ఇప్పటికే సౌదీ అరేబియాకు 10 లక్షలకు పైగా యాత్రికులు

    ఈ నేపథ్యంలో 2025లో పవిత్ర హజ్ యాత్ర జూన్ 4న ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

    సౌదీ హజ్ మంత్రి తౌఫిక్ అల్-రబియా సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ (10 లక్షల)కు పైగా యాత్రికులు ఇప్పటికే సౌదీ అరేబియాకు చేరుకున్నట్లు తెలిపారు.

    గత సంవత్సరంలో మొత్తం 1.8 మిలియన్ ముస్లింలు హజ్ యాత్రలో పాల్గొన్నారని అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి.

    వివరాలు 

    జూన్ 6న బక్రీద్

    హజ్ యాత్రలో నాలుగు రోజులపాటు వివిధ పవిత్ర కార్యాచరణలు జరుగుతాయి. ఇందులో రెండో రోజు ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది.

    ఆ రోజు ముస్లింలు అరాఫాత్ పర్వతం వద్ద భారీగా ఒక్కచోట చేరి ప్రార్థనలు నిర్వహిస్తారు.

    అరాఫాత్ పర్వతంపై ప్రవక్త మహమ్మద్ స్వయంగా తన చివరి ఉపదేశం ఇచ్చినట్టు ముస్లింల విశ్వాసం.

    ఈ సంవత్సరం అరాఫాత్ దినోత్సవం జూన్ 5న జరుగుతుందని తెలుస్తోంది.

    దీనిని అనుసరించి ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగ జూన్ 6న జరగనుందని సౌదీ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సౌదీ అరేబియా

    తాజా

    Hajj Yatra 2025: జూన్ 4 నుండి హజ్ యాత్ర ప్రారంభం.. సౌదీ అరేబియా అధికారిక ప్రకటన సౌదీ అరేబియా
    Stock Market : నేడు ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800  స్టాక్ మార్కెట్
    King Charles III: కెనడాను అమెరికాలో చేరాలని ట్రంప్ ఒత్తిడి.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ కీలక వ్యాఖ్యలు బ్రిటన్
    Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. తులం ఎంతంటే… బంగారం

    సౌదీ అరేబియా

    ఐపీఎల్ కు చెక్ పెట్టడానికి సౌదీ ఆరేబియా లీగ్ సిద్ధం! క్రికెట్
    ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు సూడాన్
    అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి?  చమురు
    భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025