హమాస్ అంటే ఏంటో తెలుసా.. ఇజ్రాయెల్ పాలస్తీనాకు ఆ కాలంలోనే చెడింది
హమాస్ అంటే ఇజ్రాయెల్‌ను ఆక్రమించేందుకు ఏర్పాటైన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ. 2007 నుంచి ఇది గాజాను పరిపాలిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో సహా ఇతర దేశాలు ఇప్పటికే హమాస్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. హమాస్‌కు నిధులు, ఆయుధాలు ఇరాన్ నుంచి అందుతున్నాయి. సున్నీ- ఇస్లామిస్ట్ మిలిటెంట్ సంస్థ అయిన హమాస్ ఇటీవలే అక్టోబర్ 6న ఇజ్రాయెల్‌పై ఆకస్మికంగా విరుచుకపడింది. దీంతో ఇరు పక్షాల మధ్య యుద్దానికి తెరలేచింది. హమాస్ సంస్థను ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ లేదా అరబిక్‌లో హరకత్ అల్-ముకావామా అల్-ఇస్లామియా అని కూడా పిలుస్తారు. ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్ ను 1987లో గాజాలో నివసిస్తున్న పాలస్తీనా శరణార్థి షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించారు.
ఒస్లో శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన హమాస్
అయితే 1920 దశకాల్లో ప్రముఖ సున్నీ ముస్లిం సమూహాలలో ఒకటిగా ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్‌లో దీని మూలాలను గుర్తించారు.ఇది ఈజిప్టులో ఉంది. హమాస్ వ్యవస్థాపకులు మ పాలస్తీనా మత గురువు. అతను ముస్లిం బ్రదర్‌హుడ్ స్థానిక శాఖల్లో కార్యకర్తగా చేరాడు.కైరోలో ఇస్లామిక్ స్కాలర్‌షిప్ కోసం తన జీవితాన్ని ప్రారంభించాడు. 1960ల చివరలో, యాసిన్ వెస్ట్ బ్యాంక్, గాజాలో బోధనలు సహా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు. 1967లో ఆరు రోజుల యుద్ధం తర్వాత ఈ రెండింటినీ ఇజ్రాయెల్ అరబ్ నుంచి స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ కు, పీఎల్ఓ (PLO) కు మధ్య 1990లో కుదిరిన ఒస్లో శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించదు.
ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించని పాలస్తీనా
పీఎల్ఓ నేత యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ఓస్లో ఒప్పందాలపై సంతకం చేసేందుకు 5 నెలల ముందు 1993లో ఇజ్రాయెల్‌పై తొలి హమాస్ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. మరోవైపు రోమన్ల కాలం నుంచే వెస్ట్ బ్యాంక్, గాజా, ఈస్ట్ జెరుసలేం, ఇజ్రాయెల్ ఏరియాలను కలిపి పాలస్తీనాగా గుర్తించారు. అయితే పాలస్తీనాను యూదుల(JEWS) మాతృభూమిగా పిలుస్తారు. బైబిల్‌లో ఈ ప్రాంతాలు యూదుల రాజ్యాలని పేర్కొన్నారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడగా పాలస్తీనీయులు కొత్త దేశాన్ని గుర్తించలేదు.వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేం ప్రాంతాలను కలిపి పాలస్తీనా అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య దశాబ్థాలుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 6న శనివారం హమాస్ హెచ్చరికల్లేకుండా వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది.
హమాస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా షేక్ అహ్మద్ యాసిన్
హమాస్ ను షేక్ అహ్మద్ యాసిన్ ప్రారంభించారు. ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడిగా చెలామణి అయ్యారు. అనంతర కాలంలో మరో ఇద్దరు నేతృత్వం వహించారు. యాహ్యా సిన్వార్ ఇస్మాయిల్ హనియే నాయకత్వంలో హమాస్ మరింత రాటుదేలింది. ఇజ్రాయెల్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో మహ్మద్ దీఫ్ ఉన్నాడు. ప్రస్తుతం వీల్ చైర్‌లో ఉన్న దీఫ్ 2002 నుంచి హమాస్ సైనిక విభాగానికి నాయకుడిగా ఉన్నాడు. 1965లో గాజా ఈజిప్టు ఆధీనంలో ఉన్నప్పుడు మహ్మద్ దీఫ్ శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980ల చివరలో దీఫ్ హమాస్‌లో చేరాడు. అనతి కాలంలో హమాస్‌లో ఎదిగాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అతని భార్య, 7 నెలల కుమారుడు, 3 సంవత్సరాల కుమార్తె 2014లో మరణించారు.