Gaza Ceasefire Deal: గాజా కాల్పుల విరమణ ఒప్పందం.. ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు బందీల విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Gaza Ceasefire Deal) ప్రకారం బందీల విడుదల కొనసాగుతోంది.
తాజగా, హమాస్ ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు బందీలను విడుదల చేసింది.
యార్డెన్ బిబాస్ (35), ఫ్రెంచ్-ఇజ్రాయెలీ ఓఫర్ కల్లెరోన్ (54) అనే బందీలను శనివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
వీరిని హమాస్ రెడ్ క్రాస్‌కు అప్పగించింది. కీత్ సీగెల్ (65) అనే మరో అమెరికన్-ఇజ్రాయెలీ వ్యక్తిని కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
వివరాలు
2 రోజుల తొలి దశ ఒప్పందంలో, హమాస్ 94 బందీలలో 33 మంది విడుదల
2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ వీరిని బంధించింది.
ఇప్పటికే, 8 మంది బందీలను గురువారం హమాస్ విడుదల చేసింది, దీనికి ప్రతిగా 110 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది.
కాల్పుల విరమణ మొదటి రోజున, హమాస్ ముగ్గురు మహిళా బందీలను విడుదల చేసింది, ఇజ్రాయెల్ వందకి పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది.
42 రోజుల తొలి దశ ఒప్పందంలో, హమాస్ 94 బందీలలో 33 మందిని విడుదల చేయనుంది, ప్రతిగా ఇజ్రాయెల్ దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనీయులను విడుదల చేయనుంది.
ఇజ్రాయెల్ ప్రకారం, హమాస్ వద్ద ఉన్న బందీలలో ఎనిమిది మంది మరణించారని సమాచారం.
వివరాలు
ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనీయుల విడుదల
ఒక ఇజ్రాయెల్ బందీని హమాస్ విడుదల చేస్తే, 30 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడుదల చేయడం కోసం ఒప్పందం కుదిరింది.
శనివారం, గాజాలో ముగ్గురు బందీలను హమాస్ ఖసమ్ బ్రిగేడ్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
అలాగే, ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనీయులను విడుదల చేయనున్నట్లు పాలస్తీనా ఖైదీల మీడియా కార్యాలయం తెలిపింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య బీకర యుద్ధం చివరిదశలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో బందీల విడుదలతో బాధిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కానీ యుద్ధం కారణంగా వలస వెళ్లిన వారు స్వస్థలాలకు చేరుకున్నపుడు తమ ఇళ్లను శిథిలాలుగా చూసి భవిష్యత్తుపై అవగాహన లేకుండా ఉన్నారు.
వివరాలు
బెకా వ్యాలీలో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ మిలటరీ దాడులు
ఇతర విభాగంలో, సిరియా-లెబనాన్ సరిహద్దు పొడవునా బెకా వ్యాలీలో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ మిలటరీ దాడులు చేసింది.
ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది.
నవంబరులో, హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం జనవరి 26వరకే అమల్లో ఉంటుందని మొదట ప్రకటించినప్పటికీ, ఫిబ్రవరి 18వరకు పొడిగించారు.
ఈ ఒప్పందం అమలు చేస్తామని అమెరికా కూడా గడచిన ఆదివారం ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్ నుండి ఉపసంహరించాల్సిందేనని, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్, ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బాదర్‌కు స్పష్టం చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన తర్వాత, ఇజ్రాయెల్ పలు దాడులు జరిపింది, దాంతో వందమందికి పైగా గాయాలపాలయ్యారు.