Hamas: హమాస్ కీలక ప్రకటన.. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తే, మిగిలిన బందీలను ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ పలుమార్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తాము శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధమే అని తాజాగా హమాస్ ప్రకటించింది. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లాలని, శాశ్వత కాల్పుల విరమణ తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.
ప్రస్తుతం మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య బందీలు, ఖైదీల మార్పిడి జరుగుతోంది.
ఒప్పందం ప్రకారం, ఇవాళ ఐదుగురు బందీలను హమాస్ అంతర్జాతీయ రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది.
Details
బందీల విడుదల
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు వీరిని కిడ్నాప్ చేశారు.
అలాగే రఫాలో తాల్ షోహమ్, అవెరా మెంగిస్టో అనే మరో ఇద్దరు బందీలను శనివారం అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌కు అప్పగించిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
36 ఏళ్ల హషామ్ అనే మరో బందీని నేడు విడుదల చేయనున్నట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశలో భాగంగా గత గురువారం హమాస్ నాలుగు మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించింది.