HAMAS : హమాస్ బందీ నోవా మార్సియానో దారుణ హత్య.. ధృవీకరించిన ఇజ్రాయెల్
హమాస్ మిలిటెంట్లు మరో దారుణానికి పాల్పడ్డారు.ఈ మేరకు 19 ఏళ్ల ఇజ్రాయెల్ యువ సైనికురాలిని పొట్టనబెట్టుకున్నారు. అక్టోబర్ 7న హమాస్ ఆకస్మిక దాడి నేపథ్యంలో వందలాది ఇజ్రాయెల్ వాసులను మిలిటెంట్లు బందీగా పట్టుకెళ్లారు. ఈ క్రమంలోనే దాదాపు 40 రోజుల తర్వాత నోవా మార్సియానోను తామే హత్య చేసినట్లు హమాస్ ప్రకటించింది. ఇదే సమయంలో పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల చేతిలో బందీగా ఉన్న నోవా మార్సియానో మరణాన్ని ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ధృవీకరించింది. పాలస్తీనా కేంద్రంగా ఉండే హమాస్ సాయుధ విభాగం 19 ఏళ్ల యువతి మార్సియానోను బందిఖానాలో ఉన్నట్లు ఓ వీడియోను ప్రదర్శించింది. మరోవైపు బందీలను ఇజ్రాయెల్ తరలించేందుకు వ్యూహాత్మకంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది.