Page Loader
Hamas-Israel: హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతం
హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతం

Hamas-Israel: హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2025
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

హమాస్ ఉగ్రవాద సంస్థను పూర్తి స్థాయిలో సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ తీవ్రమైన వైమానిక దాడులు కొనసాగిస్తోంది. గత సోమవారం నుంచి దాడులను మరింత ఉధృతం చేయగా, ఇప్పటివరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్‌లో హమాస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించింది. 'ఒసామా ఎలిమినేట్' అంటూ స్పష్టం చేసింది. అతను గురువారం జరిగిన దాడిలో మరణించినట్లు అధికారికంగా ప్రకటించింది.

Details

దాడుల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఒసామా తబాష్

ఒసామా తబాష్ హమాస్‌లో కీలకస్థాయిలో వ్యవహరిస్తూ, ఆ సంస్థ పోరాట వ్యూహాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసే కీలక నేతగా వ్యవహరించాడని ఐడీఎఫ్ తెలిపింది. దక్షిణ గాజాలో సైనిక నిఘా అధిపతిగా ఉన్న ఆయన 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడికి ప్రధాన మదతుగా నిలిచాడు. హమాస్ తరఫున చొరబాట్లను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడంతో పాటు, లక్ష్యాలను ఛేదించే వ్యూహాలు రచించడంలో ప్రముఖ పాత్ర పోషించాడని పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాల్లో సంవత్సరాలుగా కీలకంగా వ్యవహరించిన ఒసామా తబాష్‌ను టార్గెట్ చేయడమే తమ ప్రాధాన్యంగా మారిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పష్టం చేసింది. హమాస్‌పై మిగతా దాడులు కూడా తీవ్రతరం కానున్నాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.