America: హవాయిలోని అతి పురాతన కిలోవెయా అగ్నిపర్వతం బద్దలు
అమెరికాలోని అతి పురాతనమైన అగ్నిపర్వతం కిలోవెయా, హవాయి బిగ్ ఐలాండ్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ విస్ఫోటనం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం నుండి 80 మీటర్ల (260 అడుగులు) ఎత్తు వరకు లావా ప్రవహించిన వీడియోలను అమెరికా వోల్కనాలజిస్టులు విడుదల చేశారు. ఈ విస్ఫోటన పగుళ్లలో నుండి సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని, అది వాతావరణంలోని ఇతర వాయువులతో కలసి ప్రతిస్పందించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ ప్రమాదకర వాయువులు స్థానికులను, జంతువులను, పంటలను ప్రభావితం చేయవచ్చు, కాబట్టి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
మౌనా లోవా కూడా ఇందులో భాగం
హవాయి దీవులలో చురుకైన అగ్నిపర్వతాల్లో కిలోవెయా ఒకటిగా గుర్తించారు. 1983 నుండి కిలోవెయా క్రియాశీలంగా ఉన్నప్పటికీ, దానిలో తరచుగా స్వల్ప స్థాయిలో విస్ఫోటనాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితోపాటు ప్రపంచంలోనే అత్యంత పెద్ద అగ్నిపర్వతం అయిన మౌనా లోవా కూడా ఇందులో భాగమని అధికారులు తెలిపారు.