Page Loader
Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్తకు సంబంధించి హెచ్‌బీవో డాక్యుమెంటరీ షాకింగ్ రివీల్స్
బిట్‌కాయిన్ సృష్టికర్తకు సంబంధించి హెచ్‌బీవో డాక్యుమెంటరీ షాకింగ్ రివీల్స్

Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్తకు సంబంధించి హెచ్‌బీవో డాక్యుమెంటరీ షాకింగ్ రివీల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2024
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

బిట్‌కాయిన్‌ మూలాలపై హెచ్‌బీవో రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ఇప్పుడు విశేష చర్చనీయాంశంగా మారింది. సంతోషి నకమోటో అనే వ్యక్తి లేదా గ్రూప్‌ను బిట్‌కాయిన్ సృష్టికర్తగా మనమందరం ఇప్పటివరకు భావించాం. కానీ ఈ డాక్యుమెంటరీ ప్రకారం, మొదటిసారి బిట్‌కాయిన్‌ను రూపొందించిన వ్యక్తిగా కెనడాకు చెందిన పీటర్ టోడ్డ్‌ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పేరును వెల్లడించారు. 'మనీ ఎలక్ట్రిక్‌: బిట్‌కాయిన్‌ మిస్టరీ' అనే 100 నిమిషాల డాక్యుమెంటరీ ద్వారా ఈ విషయాలను ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రంలో పీటర్ టోడ్డ్‌తో పాటు, బిట్‌కాయిన్‌ మైనింగ్‌, హష్‌క్యాష్ పద్ధతిని అభివృద్ధి చేసిన ఆడమ్ బ్యాక్‌, ప్రముఖ ఇన్వెస్టర్‌ రోగర్ వెర్‌, మార్కెటర్‌ సాంసన్‌ మావో వంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు.

Details

తాజా డాక్యుమెంటరీలో హెచ్‌బీవో టోడ్డ్ పేరు

పాత బిట్‌కాయినర్ ఫోరమ్‌లలోని పోస్టింగ్స్ ఆధారంగా టోడ్డే నిజమైన సతోషి నకమోటో అని ఈ డాక్యుమెంటరీలో వివరించారు. సంతోషి నకమోటో అనే వ్యక్తి 2009లో బిట్‌కాయిన్‌ను మొదటిసారి విడుదల చేసినప్పటి నుంచే అతని అసలు స్వరూపం గురించి అనేక వాదనలు, పుస్తకాలు వెలువడ్డాయి. గతంలో సంతోషి నకమోటో పేరుతో అనేక మంది వ్యక్తులను లింక్‌ చేస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు. 2014లో న్యూస్‌వీక్‌ పత్రిక ఒక ఫిజిసిస్ట్‌ను, 2015లో న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కంప్యూటర్ సైంటిస్ట్‌ను నకమోటోగా చూపించింది. తాజా డాక్యుమెంటరీలో హెచ్‌బీవో టోడ్డ్ పేరును ప్రస్తావించడం వల్ల ఈ చర్చ మరింత వేడెక్కుతోంది.