Page Loader
Australia: విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు దుర్మరణం  
విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు దుర్మరణం

Australia: విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు దుర్మరణం  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 25, 2024
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్(Phillip Island) బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు దుర్మరణం చెందినట్లు కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియాలో ఘటన చోటుచేసుకుంది. విక్టోరియాలోని ఫిలిప్ ద్వీపంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.మెల్‌బోర్న్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బృందం సహాయచర్యల నిమిత్తం బాధితుల స్నేహితులతో టచ్ లో ఉందని కమిషన్ పేర్కొంది. ఈ ఘటన బుధవారం మధ్యాహ్న సమయంలో జరిగింది. ఫిలిప్‌ ఐలాండ్ బీచ్ సిబ్బంది వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడే ముగ్గురు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ చేసిన ట్వీట్