LOADING...
Qatar helicopter crash: ఖతార్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
ఖతార్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

Qatar helicopter crash: ఖతార్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖతార్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఖతార్ సైనిక హెలికాప్టర్ కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటన పర్షియన్ గల్ఫ్‌లోని ఖతార్ సముద్ర జలాల్లో జరిగింది. ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదం శనివారం చోటుచేసుకున్నట్లు తెలిసింది. సాంకేతిక లోపమే కారణమా హెలికాప్టర్ కూలిపోవడానికి సాంకేతిక లోపం కారణమని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సాధారణ విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్‌లో లోపం తలెత్తి, అది సముద్రంలో కూలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

వివరాలు

మృతుల వివరాలను వెల్లడించని అధికారులు

ప్రస్తుతం యూఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో మృతుల వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇక గల్లంతైన వ్యక్తిని గుర్తించేందుకు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ గాలింపు చర్యలకు కోస్ట్స్ అండ్ బోర్డర్స్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్‌కు చెందిన సముద్ర శోధన-రక్షణ బృందం నాయకత్వం వహిస్తోంది.

Advertisement