Page Loader
Russian Helicopter: రష్యాలో హెలికాప్టర్ అదృశ్యం.. 22 మంది దుర్మరణం
రష్యాలో హెలికాప్టర్ అదృశ్యం.. 22 మంది దుర్మరణం

Russian Helicopter: రష్యాలో హెలికాప్టర్ అదృశ్యం.. 22 మంది దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2024
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా తూర్పు ప్రాంతంలో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్‌ అదృశ్యమైన ఘటన తెలిసిందే. అయితే అధికారుల ప్రకటన ప్రకారం ఈ హెలికాప్టర్‌ శకలాలను చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతానికి సమీపంలో, 900 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో గుర్తించారు. అందులో ఉన్న అందరూ మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Details

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం

ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్‌‌లో ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో కమ్‌చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్‌ అగ్ని పర్వతం సమీపం నుంచి బయల్దేరింది. అయితే అది గమ్యస్థానాలకు చేరుకోలేదని రష్యా ఫెడరల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వచ్కజెట్స్‌ సమీపంలో హెలికాప్టర్‌ రాడార్‌ నుంచి మాయమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ డబుల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌ను 1960లలో రూపొందించారు. రష్యా సహా చుట్టుపక్కల దేశాల్లో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా కమ్‌చత్కాలో ఇలాంటి హెలికాప్టర్‌ 16 మంది ప్రయాణికులతో కుప్పకూలిపోయింది.