Page Loader
నేపాల్‌: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
నేపాల్‌: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం

నేపాల్‌: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం

వ్రాసిన వారు Stalin
Jul 11, 2023
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తప్పిపోయింది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నివేదించింది. సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు వెళ్లే ఛాపర్‌కు ఉదయం 10:05 గంటలకు కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. అదృశ్యమైన హెలికాప్టర్‌లో ఐదుగురు విదేశీయులు ఉన్నారు. పైలెట్‌తో కలిపి మొత్తం ఆరుగురు ఉన్నారు. హెలికాప్టర్‌ను వెతకడానికి ఒక బృందాన్ని రప్పించారు. ఆల్టిట్యూడ్ ఎయిర్ నుంచి హెలికాప్టర్‌ను మోహరిస్తున్నట్లు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి టెక్ నాథ్ సితౌలా తెలిపారు. అదృశ్యమైన హెలికాప్టర్ 'మనంగ్ ఎయిర్' సంస్థకు చెందినదిగా గుర్తించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సివిల్ ఏవియేషన్ అథారిటీ చేసిన ట్వీట్