Page Loader
Israel-Hezbollah War: టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీని టార్గెట్ చేసిన హిజ్బుల్లా.. తిప్పికొట్టిన ఐడీఎఫ్ 
టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీని టార్గెట్ చేసిన హిజ్బుల్లా.. తిప్పికొట్టిన ఐడీఎఫ్

Israel-Hezbollah War: టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీని టార్గెట్ చేసిన హిజ్బుల్లా.. తిప్పికొట్టిన ఐడీఎఫ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2024
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలలో, హిజ్బుల్లా గ్రూప్‌, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ శివార్లలో ఉన్న ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ పై క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో మిసైళ్లు లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకున్నాయని హెజ్‌బొల్లా పేర్కొంది. బుధవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించింది. లెబనాన్ నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపుగా నాలుగు మిసైల్స్ ప్రయోగించారని, వాటిలో రెండు క్షిపణులను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది. మిగతా రెండు నివాస ప్రాంతాలకు దూరంగా పడ్డాయని వెల్లడించింది. ఈ క్షిపణి దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఐడీఎఫ్‌ స్పష్టం చేసింది.

వివరాలు 

కల్కిలియా నగర సమీపంలో ఒక మిసైల్

అదే సమయంలో, ఇజ్రాయెల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాన్ టీవీ న్యూస్ ఛానల్‌ వెస్ట్ బ్యాంక్‌లోని కల్కిలియా నగర సమీపంలో ఒక మిసైల్ పడిందని, దానివల్ల ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయని, ఒక కారు ధ్వంసమైందని వార్త ప్రసారం చేసింది. సెప్టెంబర్ 23 నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజ్‌బొల్లాను అరికట్టడానికి లెబనాన్‌పై తీవ్ర వైమానిక దాడులు చేస్తున్నది. అక్టోబర్ నెల ప్రారంభంలో దక్షిణ లెబనాన్ సరిహద్దు సమీపంలో ఒక గ్రౌండ్ ఆపరేషన్‌ కూడా చేసింది. హెజ్‌బొల్లా ఆర్థిక వనరులను, సామర్థ్యాలను బలహీనపరచడం కోసం ఐడీఎఫ్‌ దాడులు కొనసాగుతున్నాయి.