క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే
ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని, తరగతి గదిలో ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఉపాధ్యాయుడిపై రెండుసార్లు పెప్పర్ స్ప్రే చేసింది. అమెరికా టెన్నెస్సీలో ఆంటియోక్‌లోని ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే ఉపాధ్యాయుడు గతంలో మరొక విద్యార్థి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా అతని ముఖంపై విద్యార్థి పంచ్‌లు ఇచ్చాడని ఈ ఆంటియోక్ హైస్కూల్‌లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాలో వారం క్రిత జరిగిన ఈ ఘటన, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విద్యార్థిని పెప్పర్ స్ప్రే చేయడంపై నెటిజన్లు ఆగ్రహం
అయితే ఉపాధ్యాయుడిపై విద్యార్థిని పెప్పర్ స్ప్రే చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తోటి విద్యార్థులు నవ్వడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అమెరికాలో ఉపాధ్యాయులను యువకులు ఎందుకు గౌరవించరని, ఈ విషయంలో తాను ఆశ్చర్యపోతున్నానని, నా స్వదేశంలో ఇలాంటి ప్రవర్తన సహించరని, ఓ నెటిజన్ స్పందించారు. ఇతర పిల్లలందరూ ఒక జోక్ లాగా నవ్వడం విచారకరమని మరొకరకు కామెంట్ చేశారు. ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థిని చేసిన చర్య చట్టబద్ధమైనది, సమర్థనీయం కానిదని, ప్రస్తుత తరం పిల్లలు ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలైపోయారని ఇంకో నెటిజన్ తన కామెంట్‌ను జోడించాడు.