LOADING...
Hongkong: 94కు చేరిన హాంకాంగ్ అగ్నిప్రమాద మరణాలు.. వందలాది మంది ఆచూకీ గల్లంతు
94కు చేరిన హాంకాంగ్ అగ్నిప్రమాద మరణాలు.. వందలాది మంది ఆచూకీ గల్లంతు

Hongkong: 94కు చేరిన హాంకాంగ్ అగ్నిప్రమాద మరణాలు.. వందలాది మంది ఆచూకీ గల్లంతు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

హాంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని సృష్టించింది. ఈ అనుకోని విపత్తు కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నభిన్నం అయ్యాయి. తమ ఆత్మీయులను కోల్పోవడమే కాదు, గృహాలు పూర్తిగా దహించిపోవడంతో అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి సన్నిహితులు, బంధువులు తమ సోదరులు, తల్లిదండ్రులు కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మరణాల సంఖ్య పెరుగుతోంది. బహుళ అంతస్థుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 94 మంది చనిపోయారని , ఇంకా అనేక మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారని అగ్నిమాపక విభాగం తెలిపింది. సజీవదహనం కావడంతో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయి.

వివరాలు 

ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ 

హాంకాంగ్ అధికారులు ఈ ప్రమాదంపై విశ్లేషణలు మొదలు పెట్టారు. ప్రాథమికంగా ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియరాకపోయినా, మెష్, ప్లాస్టిక్ షీట్లు మంటలు వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణంగా నిలిచాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా సాంప్రదాయ నిర్మాణ సామగ్రి అయిన వెదురు స్కాఫోల్డింగ్ కూడా మంటలకు ఇంధనంగా పనిచేశాయని తెలిపారు. ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం తాయ్ పో జిల్లాలోని వాంగ్ ఫక్ కోర్ట్ రెసిడెన్షియల్ ఎస్టేట్‌లో చోటుచేసుకుంది. అనేక అపార్ట్‌మెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. తప్పించుకునే మార్గం లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారని సమాచారం అందింది.

Advertisement