LOADING...
US-Iran Deal: ఇరాన్‌తో ట్రంప్‌ భారీ ఒప్పందం.. ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు ఇవే.. 
ఇరాన్‌తో ట్రంప్‌ భారీ ఒప్పందం.. ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు ఇవే..

US-Iran Deal: ఇరాన్‌తో ట్రంప్‌ భారీ ఒప్పందం.. ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు ఇవే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు త్వరలో ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. యుద్ధ వాతావరణం, చమురు సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరే దిశగా చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే దీనికి తుది రూపం దక్కే అవకాశం ఉందని వెల్లడించారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రతిపాదిత అవగాహన ఒప్పందంలో ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఐదు కీలక అంశాలు చోటు చేసుకున్నాయి.

వివరాలు 

1. హర్మూజ్‌ ఓపెన్

ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న హర్మూజ్‌ జలసంధిని పూర్తిస్థాయిలో తెరిచేందుకు ఇరాన్‌ అంగీకరించినట్లు సమాచారం. ఒప్పందం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.

వివరాలు 

2. ఇరాన్‌పై ఆంక్షల సడలింపు

ఇరాన్‌పై అమెరికా విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా చమురు ఎగుమతులకు సంబంధించిన పరిమితులను తగ్గించే దిశగా చర్యలు ఉండవచ్చని సమాచారం. దీంతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 3. మరో 60 రోజుల కాల్పుల విరమణ ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు ఇరు దేశాలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మరిన్ని దౌత్య చర్చలు జరిగి శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

4. అణ్వాయుధాలపై ఇరాన్‌ హామీ

అణ్వాయుధాల అభివృద్ధి దిశగా ముందుకు సాగబోమని ఇరాన్‌ హామీ ఇచ్చే అవకాశముందని సమాచారం. అలాగే యురేనియం నిల్వలు, అణు కార్యక్రమ భవిష్యత్తుపై చర్చలకు కూడా అంగీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే అణు ఒప్పందానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఇంకా విడిగా చర్చలు జరగాల్సి ఉందని తెలుస్తోంది. 5. అమెరికా బలగాల ఉపసంహరణ ఇరాన్‌ చాలా కాలంగా కోరుతున్న అంశాల్లో ఒకటైన అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ కూడా ప్రతిపాదిత ఒప్పందంలో భాగమైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇరాన్‌ పరిసర ప్రాంతాల్లో అమెరికా సైనిక ఉనికిని తగ్గించే అంశంపై వాషింగ్టన్‌ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

వివరాలు 

ప్రపంచంపై ప్రభావం?

ఈ ప్రతిపాదిత ఒప్పందం కార్యరూపం దాల్చితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. హర్మూజ్‌ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, ఇరాన్‌పై ఆంక్షలు సడలించడం వంటి చర్యలు ప్రపంచ చమురు మార్కెట్లలో స్థిరత్వాన్ని తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూల సంకేతాలను ఇవ్వొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అంశాలన్నీ అధికారిక ఒప్పందం ఖరారుపై ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement