Page Loader
హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా? 
హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా?

హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా? 

వ్రాసిన వారు Stalin
Oct 11, 2023
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి ఆదేశాన్ని ఉక్కిరిబిక్కి చేసింది. ఇజ్రాయెల్ కలలో కూడా ఊహించని మారణహోమం జరిగింది. అయితే హమాస్ మిలిటెంట్లు చేసిన ఈ ఆకస్మిక దాడి చేయాలన్న నిర్ణయం ఒకరోజులో తీసుకున్నది కాదు. ఇది కొన్నేళ్ల ప్రణాళిక అని చెప్పాలి. ఈ దాడికి పథక రచన చేసింది ఎవరో కాదు హమాస్ మాస్టర్‌మైండ్ 'మహ్మద్ దీఫ్'. మహ్మద్ దీఫ్ వ్యూహాల్లో దిట్ట. ఇతను హమాస్‌లోనే యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. దీఫ్ స్కెచ్ వేశాడంటే.. అది కచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. ఇప్పుడు ఇజ్రాయెల్‌పై కూడా ఎవరూ ఊహించ విధంగా మూకుమ్మడి దాడి చేసి.. ఆ దేశంలో మారణ హోమం సృష్టించాడు.

హమాస్

2021 నుంచే ప్రణాళికలు 

ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ దాడి దీఫ్ 2021నుంచి ప్రణాళికలు రచించాడు. మే 2021లో జెరూసలెంలోని ఇస్లాం మూడో పవిత్ర స్థలం అల్ అక్సా మసీదుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని దీఫ్ ఆరోజునే అనుకున్నాడు. దానికి పక్కా ప్రణాళికలు రూపొందిచాడు. ఈ దాడికి సంబంధించి హమాస్‌లో టాప్ లీడర్స్‌కు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తులు తీసుకున్నాడు. ఇజ్రాయెల్‌పై హమాస్ భారీ దాడికి సిద్ధమవుతోందని ఇరాన్‌కు, పాలస్తీనాకు, లెబనీస్ మిలిటెంట్లు హిజ్బుల్లాకు వేర్వేరుగా ముందే తెలుసు. కానీ ఈ విషయంపై పాలస్తీనా నాయకత్వం, ఇరాన్, హమాస్, లెబనీస్ మిలిటెంట్లు హిజ్బుల్లా సంయుక్తంగా నిర్వహించిన ఏ మీటింగ్‌లోనూ దీనిపై ఉమ్మడిగా చర్చంచలేదని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. దీన్ని కేవలం కొద్దిమంది మాత్రమే ఆపరేట్ చేసినట్లు వివరించింది.

హమాస్

అదును చూసి దెబ్బకొట్టిన మహ్మద్ దీఫ్ 

ఒకరకంగా చెప్పాలంటే మహ్మద్ దీఫ్ రెండేళ్లుగా స్తబ్ధుగా ఉండి ఇజ్రాయెల్‌ దృష్టిని మరల్చాడు. ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా ఇజ్రాయెల్ దృష్టి హమాస్‌పై లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు రెండేళ్ల తర్వాత అదును చూసి, ఇజ్రాయెల్ అప్రమత్తంగా లేని సమయంలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5000వేల రాకెట్లను ఒకేసారి ఇజ్రాయెల్‌పై ప్రయోగించి, ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఇలా చేయడం ద్వారా పశ్చిమాసియాలో సైనిక పరంగా చాలా శక్తిమవంతమైన ఇజ్రాయెల్‌కు హమాస్ సంస్థ సత్తాను దీఫ్ చాటాడు. ఇజ్రాయెల్ ఇంటెలీజెన్స్ సంస్థ మొస్సాద్ అనేది చాలా ప్రపంచంలోనే చాలా పవర్ ఫుల్. అలాంటి సంస్థకు చిక్కకుండా దీఫ్ తన అనుకున్న ఆపరేషన్‌ను పూర్తి చేయగలిగాడంటే.. అతని మాస్టర్‌మైండ్ ఏంటో అర్థమవుతుంది.

హమాస్

గాజాలో సొరంగాల నెట్‌వర్క్‌ అభివృద్ధి దీఫ్ ప్లానే

1965లో మహ్మద్ దీఫ్ జన్మించాడు. 1987లో హమాస్‌లో చేరాడు. 1989లో ఇజ్రాయెల్ సైన్యం అతన్ని అరెస్టు చేసి 16 నెలలు జైల్లో పెట్టింది. ఆ తర్వాత విడుదలయ్యాడు. హమాస్‌లో అనతికాలంలోనే దీఫ్ అంచెలంచెలుగా ఎదిగాడు. గాజా సరిహద్దులు ఇజ్రాయెల్ నిఘాలో ఉండటంతో బయపటి ప్రపంచంతో సంబంధాల కోసం సొరంగాల నెట్‌వర్క్‌ను దీఫ్ అభివృద్ధి చేశాడు. అంతేకాకుండా సొంతంగా బాంబు తయారీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేశాడు. ఇరాన్, సిరియా, లెబనాన్ నుంచి హమాస్‌కు ఈ సొరంగాల ద్వారానే ఆయుధాలు సరఫరా అవుతాయి. ఈ సొరంగాల వ్యవస్థను చేధించడం ఇజ్రాయెల్‌కు చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ సొరంగాలు ఏ నిఘా వ్యవస్థకు కూడా చిక్కకుండా వీటిని తీర్చిదిద్దడం గమనార్హం.