LOADING...
world's richest nation: సంపన్న దేశంలో ఆర్థిక సంక్షోభం.. యుద్ధ ప్రభావంతో కుదేలైన ఖతార్‌కు వ్యవస్థ
యుద్ధ ప్రభావంతో కుదేలైన ఖతార్‌కు వ్యవస్థ

world's richest nation: సంపన్న దేశంలో ఆర్థిక సంక్షోభం.. యుద్ధ ప్రభావంతో కుదేలైన ఖతార్‌కు వ్యవస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖతార్‌.. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న చిన్న ద్వీపకల్ప దేశం. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరొందిన ఈ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఇరాన్‌తో పెరిగిన ఘర్షణల ప్రభావం ఖతార్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆదాయ వనరులు దెబ్బతినడం, ద్రవ్యోల్బణ భయాలు పెరగడం ఆ దేశానికి కొత్త సవాళ్లుగా మారాయి.

వివరాలు 

సహజ వాయువే ప్రధాన బలం

ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడిన ఖతార్‌కు సహజ వాయువు పెద్ద ఆధారంగా నిలిచింది. ముఖ్యంగా 1990ల తర్వాత దేశ ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈశాన్య ప్రాంతంలోని నార్త్‌ఫీల్డ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఉత్పత్తి చేసే వాయువును ద్రవరూపంలోకి మార్చి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఖతార్‌ అపారమైన ఆదాయం సంపాదించింది. 1996లో తొలిసారి జపాన్‌కు ద్రవ సహజ వాయువును ఎగుమతి చేసిన ఖతార్‌.. అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంది. 2010 నాటికి కోట్ల టన్నుల ఉత్పత్తి స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం దేశ ఆదాయంలో సుమారు 60 శాతం వరకు సహజ వాయువు, దానికి సంబంధించిన ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది.

వివరాలు 

యుద్ధ ప్రభావంతో దెబ్బతిన్న ఎగుమతులు

ఫిబ్రవరి చివర్లో పశ్చిమాసియాలో మొదలైన ఉద్రిక్తతల వల్ల ప్రపంచానికి ఖతార్‌ తలుపులు మూతపడినట్లయ్యింది. ఈ దేశం దిగుమతులు, ఎగుమతుల కోసం ప్రధానంగా హర్మూజ్‌ జలసంధిపైనే ఆధారపడుతుంది. అయితే యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్‌ ఆ మార్గాన్ని మూసివేయడంతో ఖతార్‌ వాణిజ్య కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జలమార్గం నిలిచిపోయిన కొద్ది గంటల్లోనే ఒప్పందాల ప్రకారం సరఫరాలు కొనసాగించడం సాధ్యం కాదని ఖతార్‌లోని అతిపెద్ద ఇంధన సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా దేశంలోని ప్రధాన సహజ వాయువు కేంద్రం రాస్‌ లఫాన్‌పై జరిగిన క్షిపణి, డ్రోన్‌ దాడులు పరిస్థితిని మరింత విషమం చేశాయి. ఈ దాడుల్లో ఉత్పత్తి కేంద్రం తీవ్రంగా ధ్వంసమైంది.

Advertisement

వివరాలు 

ఆహార కొరత.. పెరుగుతున్న ధరలు

దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఖతార్‌కు వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఖతార్‌లో ఆహార అవసరాల కోసం ఎక్కువగా ఇతర దేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. హర్మూజ్‌ జలసంధి మూసివేతతో సముద్ర మార్గంలో సరఫరాలు నిలిచిపోయాయి. దీంతో విమాన మార్గంలో ఆహార పదార్థాలను తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రవాణా వ్యయం భారీగా పెరిగి వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు యుద్ధ భయాలతో అమెరికా సహా పలు దేశాలు గల్ఫ్‌ ప్రాంతాలకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ఖతార్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతుండగా చిన్న వ్యాపారులు, హోటళ్ల ఆదాయం పడిపోయింది.

Advertisement

వివరాలు 

ఆహార కొరత.. పెరుగుతున్న ధరలు

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఖతార్‌ ఆర్థిక వ్యవస్థ దాదాపు 8.6 శాతం వరకు క్షీణించే అవకాశముందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. పరిస్థితి మరింత దిగజారితే దేశ నిల్వ నిధులపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement