Donald Trump Inauguration: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సానికి సర్వం సిద్ధం.. ఎలా జరగనుంది,ఎవరెవరు వస్తున్నారు
ఈ వార్తాకథనం ఏంటి
రిపబ్లిక్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ వేడుకలలో భాగంగా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు అమెరికాలో జరుగనున్న ఈ వేడుకలలో అనేక ప్రముఖులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.
ప్రదర్శనలు,కార్యక్రమాలు:
2005లో "అమెరికన్ ఐడల్" గెలిచి కెరీర్ ప్రారంభించిన కేరీ అండర్‌వుడ్, ట్రంప్ ప్రమాణానికి ముందు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఈ ఈవెంట్ ముగింపులో, ఒపెరా గాయకుడు క్రిస్టోఫర్ మచియో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు.
లీ గ్రీన్‌వుడ్ వంటి గాయకులు, యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా-లింకన్, యునైటెడ్ స్టేట్స్ మెరైన్ బ్యాండ్‌కు చెందిన కళాకారులు వివిధ ప్రదర్శనలతో పాల్గొననున్నారు.
వివరాలు
ప్రమాణ స్వీకార వేడుక వివరాలు:
అమెరికా రాజ్యాంగంలోని 20వ సవరణ ప్రకారం, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలం జనవరి 20, 2025తో ముగుస్తుంది.
దీని ప్రకారం, వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం లోపల రోటుండాలో ట్రంప్ సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ ప్రమాణాన్ని అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ చేయించనున్నారు.
ఈ సందర్భంగా రోటుండా సముదాయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మిలిటరీ రెజిమెంట్లు, స్కూల్ బ్యాండ్స్ ప్రదర్శనలతో పాటు ప్రముఖ గాయని కేరీ అండర్‌వుడ్ సంగీత కచేరీ నిర్వహిస్తారు.
ఆమె "అమెరికా ది బ్యూటిఫుల్" ఆలపించనున్నారు. ట్రంప్ ప్రసంగం తర్వాత ఈ ప్రదర్శన జరుగుతుందని సమాచారం.
వివరాలు
ఆనందకర సాయంత్రం:
ప్రమాణస్వీకారం అనంతరం జరిగే వేడుకల్లో జాసన్ ఆల్డియన్,రాస్కల్ ఫ్లాట్స్,పార్కర్ మెక్‌కొల్లమ్, గవిన్ డెగ్రా తదితర కళాకారుల ప్రదర్శనలు ఉండనున్నాయి.
ఈ కార్యక్రమాలు అతిథులకు ఉత్సాహాన్ని కలిగించడమే కాకుండా ఆనందభరితమైన సాయంత్రాన్ని అందించనున్నాయి.ట్రంప్ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అట్టహాసంగా మ్యూజికల్ నైట్
అత్యంత ప్రాచుర్యం పొందిన 1970ల నాటి క్లాసిక్ డిస్కో సాంగ్"YMCA"కు ట్రంప్ స్టెప్పులేశారు.
ఆదివారం రాత్రి కాపిటల్ వన్ అరేనాలో జరిగిన ట్రంప్"మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్"ర్యాలీ,డిస్కో గ్రూప్ విలేజ్ పీపుల్ పాట ప్రదర్శనతో ముగిసింది.
ఈ వేడుకలో ట్రంప్ పాల్గొనడమే కాకుండా,బ్యాండ్ సభ్యులతో కలిసి నృత్యం చేసి,వారితో కరచాలనం చేశారు.
ఈకార్యక్రమాలను అమెరికా సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ కమిటీకి సెనెటర్ అమీ క్లోబుచర్ నాయకత్వం వహిస్తున్నారు.
వివరాలు
ఎవరెవరు హాజరవుతారు?
వాషింగ్టన్ డీసీలో 2 లక్షల మంది ప్రజలు కనిపించే అవకాశం ఉందని స్థానిక ఫెడరల్ అధికారుల అంచనాల ప్రకారం తెలుస్తోంది.
వీరిలో ట్రంప్ మద్దతుదారులు, నిరసనకారులు కూడా ఉండవచ్చు. ఈ కార్యక్రమానికి అమెరికా సెనేటర్లు, హౌస్ మెంబర్లు, అలాగే రాబోయే ప్రభుత్వానికి చెందిన అతిథులు హాజరుకానున్నారు.
ట్రంప్, వాన్స్, వారి కుటుంబాలు తర్వాత, ఈ కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన వారిలో పదవి నుంచి దిగిపోతున్న అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, వారి భాగస్వాములు కూడా ఉంటారు.
ఇందులో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వారి భాగస్వాములు జిల్ బైడెన్, డగ్ ఎమ్‌హాఫ్ ముఖ్య వ్యక్తులుగా భాగస్వామ్యం చెందుతారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీ చేసి కమలా హారిస్ విజయాన్ని సాధించారు.
వివరాలు
ఎవరెవరు హాజరవుతారు?
మాజీ అధ్యక్షులు, మాజీ ఫస్ట్ లేడీలు కూడా తరచూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అయితే, మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా ఈ సారి కార్యక్రమానికి హాజరుకాబోరని ఆమె కార్యాలయం తెలిపింది.
2009లో తన భర్త బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఇనాగ్యురేషన్ కార్యక్రమానికి మిషెల్ హాజరయ్యారు.
2017లో ట్రంప్ మొదటి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆమె హాజరయ్యారు. బరాక్ ఒబామా ఈ రోజు ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
వివరాలు
ఎవరెవరు హాజరవుతారు?
మరో మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన భార్య లారా బుష్ కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు.
అయితే, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ఈ కార్యక్రమానికి హాజరుకాబోరని సమాచారం.
అంతేకాకుండా, ప్రముఖ టెక్నాలజీ బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది.
టిక్‌టాక్ సీఈవో సౌ జి చువ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారని తెలుస్తోంది.
అమెరికాలో టిక్‌టాక్ సేవలు నిలిపివేయడానికి ఒక్కరోజు ముందు ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. చైనా ఉపాధ్యక్షులు హన్ ఝెంగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.