Page Loader
దక్షిణాఫ్రికాలో భారీ పేలుడు.. ఒకరు మృతి, 48 మందికి గాయాలు
ఉలిక్కిపడ్డ జోహన్నెస్‌బర్గ్ నగరం

దక్షిణాఫ్రికాలో భారీ పేలుడు.. ఒకరు మృతి, 48 మందికి గాయాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 21, 2023
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది గాయపడ్డారు. అందులో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మరో 36 మందికి చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. పేలుడు తీవ్రతకు మినీ బస్సు, ట్యాక్సీలు బోల్తాపడ్డాయి. రోడ్లు సైతం దెబ్బతినడంతో ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చాయి. రద్దీ సమయంలో జరిగిన ఈ ఘటన జరగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురై వెంటనే పరుగులు తీశారు. మరోవైపు సహాయక చర్యల కోసం వచ్చిన అగ్నిమాపక వాహనం కిందే ఓ మృతదేహం లభ్యమైంది. పేలుడుకు భూగర్భ గ్యాస్ పైపులైన్లలోని గ్యాస్ లీకేజీ కారణమని అంచనా వేస్తున్నట్లు అధికారి పన్యాజా లెసుఫీ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ జిల్లాలో భారీ పేలుడు