Myanmar: మయన్మార్‌లో భారీ వరదలు.. 74 మంది దుర్మరణం
మయన్మార్‌లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. టైఫూన్ యాగీ తుపాను కారణంగా వచ్చిన ఈ వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఈ వరదల కారణంగా మృతుల సంఖ్య 74కి చేరింది. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వర్షాలు, వరదలు రాజధాని నేపిడావ్ సహా అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రభుత్వ సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ, వరద పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, మయన్మార్ సైనిక పాలక వర్గం జుంటా విదేశాల నుంచి సాయం కోరినట్లు స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.