LOADING...
USA: యుద్ధంలో భారీ నష్టం.. 39 రోజుల్లో 39 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయిన యూఎస్
యుద్ధంలో భారీ నష్టం.. 39 రోజుల్లో 39 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయిన యూఎస్

USA: యుద్ధంలో భారీ నష్టం.. 39 రోజుల్లో 39 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయిన యూఎస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2026
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ'లో యూఎస్ సైన్యానికి భారీ నష్టం జరిగినట్లు సమాచారం. దాదాపు 39 రోజులు కొనసాగిన ఈ యుద్ధంలో అగ్రరాజ్యానికి చెందిన 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ముదిరాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఐదు వారాలకు పైగా కొనసాగిన ఈ ఘర్షణల్లో అమెరికాకు చెందిన 39 విమానాలు కూలిపోయినట్లు సమాచారం. మరో 10 విమానాలు వివిధ స్థాయిల్లో దెబ్బతిన్నాయని తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం కూలిన వాటిలో ఒక A-10, నాలుగు F-15 Strike Eagle యుద్ధవిమానాలు ఉన్నాయి.

వివరాలు

ఐదో తరం యుద్ధవిమానం శత్రు దాడికి గురికావడం ఇదే తొలిసారి

అలాగే ఇరాన్ గగనతలంలో అమెరికా అత్యాధునిక F-35 స్టెల్త్ యుద్ధవిమానం ఒకటి దెబ్బతిన్నట్లు సమాచారం. అగ్రరాజ్యం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఐదో తరం యుద్ధవిమానం శత్రు దాడికి గురికావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే, సౌదీ ఆరేబియాలోని ఓ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఐదు KC-135 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయి. అయితే వాటిలో కొన్నింటిని మరమ్మతు చేసినట్లు తెలుస్తోంది. అదే దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక Boeing E-3 Sentry నిఘా విమానం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

వివరాలు

అమెరికా డ్రోన్ విభాగానికి కూడా భారీ నష్టం

ఇక అమెరికాకు చెందిన నాలుగు F-15E ఫైటర్ జెట్‌లు కూడా కూలిపోయాయి. వీటిలో మూడు Kuwaitలో జరిగిన 'ఫ్రెండ్లీ ఫైర్' ఘటనలో కూలినట్లు యూఎస్ సెంటకామ్ పేర్కొంది. అదేవిధంగా కువైట్‌లోని అమెరికా స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక CH-47 Chinook హెలికాప్టర్ ధ్వంసమైనట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇవికాకుండా ఈ ఘర్షణల్లో అమెరికా డ్రోన్ విభాగానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 24 MQ-9A Reaper డ్రోన్‌లు ధ్వంసమైనట్లు సమాచారం.

Advertisement