LOADING...
Russia: రష్యాకు భారీ షాక్.. 2,000 కి.మీ. లోపలికి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ డ్రోన్లు!
రష్యాకు భారీ షాక్.. 2,000 కి.మీ. లోపలికి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ డ్రోన్లు!

Russia: రష్యాకు భారీ షాక్.. 2,000 కి.మీ. లోపలికి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ డ్రోన్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి భారీ దాడికి దిగింది. ఈసారి రష్యా భూభాగంలోకి దాదాపు 2,000 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లిన దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఉరల్ ప్రాంతంలోని ట్యూమెన్ చమురు క్షేత్రంపై దాడి చేసింది. ఈ దాడిలో చమురు క్షేత్రంలోని కొన్ని భాగాలు ధ్వంసమైనప్పటికీ, ప్రధాన ప్లాంట్‌కు ఎలాంటి నష్టం జరగలేదని ఉరల్స్ గవర్నర్ అలెగ్జాండర్ మూర్ వెల్లడించారు. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చమురు క్షేత్రంపై దాడి జరగడం విశేషంగా మారింది. మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు.

వివరాలు

ప్రతిరోజూ సుమారు 1,51,000 బ్యారెళ్ల చమురు శుద్ధి

తమ దేశం అత్యాధునిక దీర్ఘశ్రేణి డ్రోన్లను అభివృద్ధి చేసిందని, అవి దాదాపు 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉన్నాయని వెల్లడించారు. రష్యాలోని అతిపెద్ద ప్రైవేటు చమురు శుద్ధి కేంద్రాల్లో ట్యూమెన్ రిఫైనరీ ఒకటి. ఈ కేంద్రంలో ప్రతిరోజూ సుమారు 1,51,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తారు. దేశీయ అవసరాల కోసం భారీ స్థాయిలో ఇక్కడి నుంచి చమురు సరఫరా అవుతుంది. ఇటీవలి కాలంలో రష్యా చమురు క్షేత్రాలు, రిఫైనరీలను ఉక్రెయిన్ వరుసగా లక్ష్యంగా చేసుకుంటోంది. గత వారం మాస్కోలోని ఒక ప్రధాన రిఫైనరీపై రెండు సార్లు భారీ దాడులు చేసింది.

వివరాలు

రష్యాలోని పలు ప్రాంతాల్లో చమురు కొరత

ఈ వరుస దాడుల ప్రభావంతో రష్యాలోని పలు ప్రాంతాల్లో చమురు కొరత ఏర్పడినట్లు సమాచారం. అలాగే పెట్రోల్ ధరలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్లు ఉరల్స్ పర్వత ప్రాంతాల వరకు చేరుకోవడంతో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉరల్ ప్రాంతంలోని పలు విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

Advertisement