Loading...
Joe Biden: జో బైడెన్ ఆరోగ్యం విషమం.. చికిత్సపై కుమారుడు హంటర్ కీలక వ్యాఖ్యలు
జో బైడెన్ ఆరోగ్యం విషమం.. చికిత్సపై కుమారుడు హంటర్ కీలక వ్యాఖ్యలు

Joe Biden: జో బైడెన్ ఆరోగ్యం విషమం.. చికిత్సపై కుమారుడు హంటర్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు ఉన్న క్యాన్సర్ మరింతగా వ్యాప్తి చెందిందని, చికిత్స సమయంలో తీవ్ర నొప్పిని ఎదుర్కొంటున్నారని ఆయన కుమారుడు హంటర్ బైడెన్ వెల్లడించారు. క్యాన్సర్ ఎముకలకే పరిమితం కాకుండా శరీరంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించిందని ఆయన తెలిపారు. బీబీసీ 'న్యూస్‌నైట్' కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో హంటర్ బైడెన్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. జో బైడెన్ క్యాన్సర్ ప్రస్తుతం చాలా బాధాకరమైన స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. శారీరకంగా తన తండ్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే హంటర్ బైడెన్ చేసిన తాజా వ్యాఖ్యలపై జో బైడెన్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.

వివరాలు 

జో బైడెన్‌ చెబితేనే..

2025 మేలో తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు.

ఇది వేగంగా వ్యాప్తి చెందే క్యాన్సర్ రకమని, అప్పటికే వ్యాధి ఎముకలకు చేరినట్లు వైద్యులు గుర్తించారని ఆయన కార్యాలయం తెలిపింది.

అనంతరం బైడెన్ రేడియేషన్ చికిత్సతో పాటు హార్మోన్ థెరపీ తీసుకుంటున్నట్లు సమాచారం.

వయసుతోపాటు ఆరోగ్యంపై చర్చ

83 ఏళ్ల జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత వృద్ధ నేతల్లో ఒకరు.

2021 నుంచి 2025 వరకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన శారీరక ఆరోగ్యం, మానసిక చురుకుదనంపై పలుమార్లు చర్చ జరిగింది.

ముఖ్యంగా 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్ వయసు, ఆరోగ్య పరిస్థితి ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి.

వివరాలు 

రాజకీయ జీవితంలో కీలక అధ్యాయం

డెలావేర్ నుంచి చాలా కాలం సెనేటర్‌గా పనిచేసిన జో బైడెన్.. 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

అనంతరం 2020 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న బైడెన్.. తన రాజకీయ జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల పుస్తకాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

ట్రంప్‌ ఏమన్నారంటే..

జో బైడెన్‌కు క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడైన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

ఈ విషయం చాలా బాధాకరమని పేర్కొంటూ బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అయితే ఆ తర్వాత ఈ వ్యవహారంపై రాజకీయపరమైన ప్రశ్నలను కూడా లేవనెత్తారు.

బైడెన్‌కు క్యాన్సర్ ఉన్న విషయం ప్రజలకు ఆలస్యంగా ఎందుకు వెల్లడించారంటూ ప్రశ్నించారు.

అయితే హంటర్ బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ ఇప్పటివరకు స్పందించలేదు.

ADVERTISEMENT