తుపాకీ కొనుగోలు కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం అక్రమంగా తుపాకీ కొనుగోలు చేసిన కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను డెలావేర్‌లోని ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది. 2018లో ఆయుధాలు కొనుగోలు చేసేందుకు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ అబద్ధం చెప్పాడన్న ఆరోపణలపై బైడెన్‌పై సుదీర్ఘకాలంగా విచారణ కొనసాగింది. ఆయుధాన్ని విక్రయించేటప్పుడు హంటర్ తన మాదకద్రవ్యాల అలవాటు గురించి అబద్ధం చెప్పినట్లు అభియోగాలు మోపారు. విచారణలో అభియోగాలు నిజమని తేలడంతో కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. అమెరికా చరిత్రలో అధ్యక్షుడి కొడుకు ఓ కేసులో దోషిగా తేలడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బైడెన్‌పై అభిశంసన విచారణ
హంటర్ బైడెన్ ప్రస్తుతం మూడు కేసుల్లో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఒకటి ఆయుధాల కొనుగోలు కేసు కాగా, దీంట్లో ఆయన దోషిగా తేలారు. ఆర్థిక వ్యాపార లావాదేవీలపై కూడా హంటర్ బైడెన్‌పై విచారణ కొనసాగుతోంది. సకాలంలో పన్నులు చెల్లించలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయంలో కాలిఫోర్నియా లేదా వాషింగ్టన్‌లో దావా వేయవచ్చని ప్రత్యేక న్యాయవాది సూచించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పరిణామాలు బైడెన్‌కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం నాలుగు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. హంటర్ వ్యాపార లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో బిడెన్‌పై అభిశంసన విచారణను ప్రారంభించాలని సభను అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ ఆదేశించారు.