Page Loader
America: అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!

America: అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!

వ్రాసిన వారు Stalin
Apr 09, 2024
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

గత నెల నుంచి అదృశ్యమైన 25ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ మరణం వారం వ్యవధిలో రెండోది కాగా 2024లో 11వది. అర్ఫాత్ మరణాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది."సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడని తెలుసుకుని చాలా బాధపడ్డాము" అని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేశారు. క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీ విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపేందుకు యుఎస్‌లోని స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ తెలిపింది. క్లీవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు అర్ఫాత్ మే 2023లో US వెళ్లారు .

Details 

కిడ్నాపర్ నుండి కాల్.. నగదు ఇవ్వకుంటే కిడ్నీలు అమ్మేస్తామని బెదిరింపు 

అర్ఫాత్ మార్చి 7న అదృశ్యమయ్యాడు.అప్పటి నుంచి అర్ఫాత్‌తో సంబంధాలు తెగిపోయాయని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని అతని తండ్రి చెప్పారు. అటు తరువాత,మార్చి 19న,అర్ఫాత్ కుటుంబానికి తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది. డ్రగ్స్ అమ్మే ముఠా అతడిని కిడ్నాప్ చేసిందని,అతడిని విడుదల చేయడానికి $1,200 డిమాండ్ చేసారని అర్ఫాత్ తండ్రి తెలిపారు. అడిగిన నగదు చెల్లించకుంటే విద్యార్థి కిడ్నీలను కూడా అమ్మేస్తానని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడని అర్ఫాత్ తండ్రి తెలిపారు. మార్చి 21న,అర్ఫాత్‌ను గుర్తించేందుకు స్థానిక చట్ట అమలు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు భారత కాన్సులేట్ తెలిపింది. విద్యార్థి కుటుంబం అర్ఫాత్‌ను గుర్తించి భారత్‌కు తీసుకురావాలని అభ్యర్థిస్తూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ కూడా రాసింది.