Iran - Israel War: నా మాట వినలేదు.. ఇరాన్‌పై దాడుల తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఇరాన్ మళ్లీ అణు ఆయుధాల తయారీకి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకే అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులు చేపట్టిందని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉన్న నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నామని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై తన అసంతృప్తిని ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇరాన్‌కు అణు ఆయుధాలు ఉండకూడదు అనే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
Details
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ దాడులు
ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ వారం మొత్తం చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. తాను ఇరాన్‌పై సైనిక చర్యలు కోరుకోవడం లేదని, అయితే కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్-యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా క్షిపణి దాడులు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు, ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా 'షీల్డ్ ఆఫ్ జూద్' పేరుతో ఆపరేషన్ ప్రారంభించి సుమారు 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి.
Details
ఇరాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరించింది. సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ దాడులు చేపట్టినట్లు ప్రకటించింది. అలాగే ఇజ్రాయెల్ తన ఎయిర్‌స్పేస్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త ఆపరేషన్ అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించారని సమాచారం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.