LOADING...
Trump: జీ-7 సదస్సులో వైరల్ అయిన 'బాస్‌' కామెంట్‌.. అసలు ఉద్దేశం చెప్పిన ట్రంప్
జీ-7 సదస్సులో వైరల్ అయిన 'బాస్‌' కామెంట్‌.. అసలు ఉద్దేశం చెప్పిన ట్రంప్

Trump: జీ-7 సదస్సులో వైరల్ అయిన 'బాస్‌' కామెంట్‌.. అసలు ఉద్దేశం చెప్పిన ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ''నేనే బాస్‌'' వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ.. తాను ఆ మాటలను పూర్తిగా సరదా కోసమే అన్నానని స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ను హోస్ట్ ఈ అంశంపై ప్రశ్నించారు. ''జీ-7 సదస్సులో మీరు వేదికలోకి ప్రవేశించి, ప్రపంచ నేతలందరి ముందు మిమ్మల్ని మీరు బాస్‌గా ప్రకటించుకున్నారు. ఆ మాటను ఎంతమంది నిజంగా నమ్మి ఉంటారని భావిస్తున్నారు?'' అని ప్రశ్నించగా.. ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు.

వివరాలు 

ఆ మాట అన్నది సరదాకే..

''అందరూ నమ్ముతారు. కానీ నేను ఆ మాట అన్నది సరదాకే. అక్కడ ఉన్న వారంతా నాకు బాగా పరిచయమైన దేశాధినేతలే. వారిని చూసి సరదాగా 'నేనే బాస్‌' అని చెప్పాను. అది కేవలం జోక్ మాత్రమే. అయితే ఆ వ్యాఖ్య ప్రపంచమంతా వైరల్ అవుతుందని నేను ఊహించలేదు. ఆ విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను అందరినీ నవ్వించాలనుకున్నాను తప్ప, ఎవరిపైనా పెత్తనం చేయాలనే ఉద్దేశం నాకు లేదు'' అని ట్రంప్ వివరించారు.

వివరాలు 

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు

కాగా, ప్రపంచంలోని సంపన్న దేశాల కూటమి 'గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ-7)' 52వ శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఫ్రాన్స్‌లోని ఎవియాన్ లే బైన్స్‌లో నిర్వహించారు. తన 80వ పుట్టినరోజు వేడుకలు ముగిసిన వెంటనే ట్రంప్ నేరుగా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇక, 2027లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది.

Advertisement