Donald Trump: 'నేను పోరాడుతా'.. సర్, వెంటనే వెళ్దాం'.. డొనాల్డ్ ట్రంప్-సీక్రెట్ సర్వీస్ మధ్య ఉద్రిక్త సంభాషణ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవి ప్రమాదాలతో కూడుకున్నదని పూర్తిగా తెలుసని స్పష్టం చేశారు. తాను భయపడే వ్యక్తి కాదని, ఎలాంటి ముప్పులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందని పేర్కొన్నారు. ఈ పదవిలో ఉన్న ప్రమాదాల గురించి ముందుగానే మార్కో రుబియో, పీట్ హెగ్సెత్ తనకు వివరించారని తెలిపారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన కాల్పుల ఘటన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడినట్లు ఆయన వెల్లడించారు. కాల్పుల తర్వాత కూడా తాను హోటల్‌లోనే ఉండి డిన్నర్ కార్యక్రమాన్ని కొనసాగించాలని భావించానని ట్రంప్ తెలిపారు. తాను పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పారు.
వివరాలు
తన
అయితే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది పరిస్థితి తీవ్రతను వివరించి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒప్పించడంతో తాను బయటకు వచ్చినట్లు తెలిపారు. తరువాత శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, దుండగుడు అనేక ఆయుధాలతో సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పైకి దూసుకొచ్చాడని వివరించారు. ఈ ఘటన, భవిష్యత్తులో మరింత కట్టుదిట్టమైన భద్రత అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. వైట్ హౌస్‌లో ప్రత్యేక బాల్‌రూమ్ అవసరం ఉందని కూడా సూచించారు. తనపై దాడి ఇదే మొదటిసారి కాదని ట్రంప్ పేర్కొన్నారు. మరో 30 రోజుల్లో ఈ డిన్నర్ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు.
వివరాలు
అసలు ఘటన వివరాలు
డిన్నర్ వేదిక వద్ద సీక్రెట్ సర్వీస్ ఏర్పాటు చేసిన భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఒక దుండగుడు షాట్‌గన్‌తో పాటు పలు కత్తులతో లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడినట్లు జెఫ్రీ డబ్ల్యూ కారోల్ వెల్లడించారు. నిందితుడిని 31 ఏళ్ల కోలో టామోస్ అలెన్‌గా గుర్తించారు. అతడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంతానికి చెందినవాడని తెలిపారు. ఇప్పటికే అతని అపార్ట్‌మెంట్‌ను చట్ట అమలు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అదేవిధంగా, నిందితుడు వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో అతిథిగా ఉన్నాడని పోలీస్ కమిషనర్ తెలిపారు.