Page Loader
ICC: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ 
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్‌

ICC: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
06:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గాజాలో మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన యుద్ధ నేరాలకు సంబంధించి ఈ వారెంట్లు జారీ అయినట్లు ఐసీసీ పేర్కొంది. ఆకలిని యుద్ధ పద్ధతిగా వినియోగించినట్లు వారి పై ఆరోపణలు ఉన్నాయి. ఈ వారెంట్ల ప్రకారం, ఐసీసీ 122 సభ్య దేశాల్లో నెతన్యాహూ లేదా గాలంట్ ప్రవేశిస్తే, వారిని వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

 44,000 మంది కంటే ఎక్కువ మంది మృతి 

2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్‌గళ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1,200 మందిని హతమార్చారు. దాదాపు 240 మంది ఇజ్రాయిలీ బందీలను గాజాలోకి తీసుకెళ్లారు. ఆ దాడి తర్వాత ఇజ్రాయిల్, గాజాలో హమాస్‌పై యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధంలో మిలిటెంట్లతో పాటు సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 44,000 మంది కంటే ఎక్కువ మంది మరణించారని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు, 101 మంది ఇజ్రాయిలీ బందీలు ఇంకా గాజాలోనే ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఇజ్రాయిల్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.